Begin typing your search above and press return to search.

కొండ‌చిలువ బ‌ద్ధ‌కం విరుచుకుంటోంది!

By:  Tupaki Desk   |   20 Jun 2022 4:29 AM GMT
కొండ‌చిలువ బ‌ద్ధ‌కం విరుచుకుంటోంది!
X
పాము పొర విడిచిన‌ట్టు ఆ దృశ్యం షాక్ కి గురి చేస్తోంది. ఇలాంటివి వీక్షించే భాగ్యం ప్ర‌జ‌ల‌కు చాలా అరుదు. లైవ్ లీగా ఆ అవ‌కాశం ద‌క్క‌దు. కానీ కొన్నిసార్లు అందాల క‌థానాయిక‌ల విన్యాసాల‌తో అలాంటి అవ‌కాశం క‌లుగుతుంది. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న స‌ర్ప‌క‌న్య రూపం యువ‌త‌ను అంతే ఎగ్జ‌యిట్ చేస్తోంది. ఇంత‌కీ ఎవ‌రీ స‌ర్ప‌క‌న్య‌? ఎవ‌రీ విష‌క‌న్య‌? అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారంతా.

అంత‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు .. సీకే బ్యూటీగా పాపుల‌రైన దిశా ప‌టానీ లేటెస్ట్ ఫోటోషూట్ ఇది. డార్క్ బ్రౌన్ గ‌దిలో అలా మూల‌గా దిశా లుక్ స‌ర్ప‌క‌న్య‌నే త‌ల‌పిస్తోంది. స‌ర్పం విర‌హంతో వీగిపోతున్న దృశ్యంలా.. కొండ చిలువ బ‌ద్ధ‌కం విరుచుకుంటున్న స‌న్నివేశంలా ఈ లుక్ క‌నిపిస్తోంది. ఈ ఫోటోగ్రాఫ్ లో దిశా ఒంపుసొంపుల రూప‌లావ‌ణ్యం బ‌య‌ట‌ప‌డింది. ఇక ఆ ముఖంపై సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ మ‌రో లెవ‌ల్ అంటూ యూత్ కీర్తించేస్తున్నారు.

హాట్ కంటెంట్ ని కుర్రకారు గుండెల్లోకి పంప్ చేయ‌డ‌మెలాగో దిశాప‌టానీకి తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలీదేమో! తాజా ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. కుర్ర‌కారు వాట్సాపుల్లో అగ్గిరాజేస్తోంది. గోధుమరంగు కటౌట్ దుస్తులలో దిశా లుక్ హీటెక్కిస్తోంది.

ఒక ర‌కంగా దిశా బోల్డ్ లుక్ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్ అని చెప్పాలి. అభిమానులు కామెంట్ సెక్షన్ లో హార్ట్ - ఫైర్ ఎమోజీలతో మంట‌లు పుట్టిస్తున్నారు. దిశా టూ హాట్ అంటూ కొంద‌రు వ్యాఖ్యానించ‌గా.. రెడ్-హాట్ అవతార్ అంటూ పొగిడేస్తున్నారు.

29 ఏళ్ల దిశా కెరీర్ ప‌రంగా పూర్తి బిజీగా ఉంది. తదుపరి మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఏక్ విలన్ 2 లో కనిపించనుంది. ఇందులో జాన్ అబ్రహం- ఆదిత్య రాయ్ కపూర్- అర్జున్ కపూర్ - తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం ఈ ఏడాది జూలై 8న‌ విడుదల కానుంది. త‌దుప‌రి ధర్మ ప్రొడక్షన్స్ లో సిద్ధార్థ్ మల్హోత్రా - రాశి ఖన్నా ల‌తో క‌లిసి భారీ యాక్షన్-డ్రామా చిత్రం 'యోధా'లో క‌నిపించ‌నుంది. ఈ చిత్రం 2022 నవంబర్ 11న థియేటర్లలోకి రానుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ కె'లో కూడా కనిపించనుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- దీపికా పదుకొణె వంటి టాప్ స్టార్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.