Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఎన్టీఆర్‌ తో క్యూట్‌ బాలయ్య హరికృష్ణ

By:  Tupaki Desk   |   16 July 2021 4:22 AM GMT
పిక్ టాక్ : ఎన్టీఆర్‌ తో క్యూట్‌ బాలయ్య హరికృష్ణ
X
సాదారణంగా మన చిన్నప్పటి ఫొటోలు చూసుకుంటేనే చాలా ప్రత్యేకంగా.. చాలా వింతగా నవ్వు తెప్పించే విధంగా క్యూట్ గా ఉంటాయి. అలాంటిది సెలబ్రెటీల ఫొటోలు అది కూడా చిన్నప్పటి ఫొటోలు కనిపిస్తే కొద్ది సమయం అలాగే చూస్తూ ఉండి పోతాం. సెలబ్రెటీల చిన్నప్పటి ఫొటోలు ఏవైనా కూడా నెట్టింట ఎప్పుడు ట్రెండ్‌ అవుతూనే ఉంటాయి. ఒక్క ఫొటో ఏదైనా సోషల్‌ మీడియాలో సెలబ్రెటీల చిన్నప్పటి ఫొటోలు పోస్ట్‌ అయితే ఇక ఆ ఫొటోను కొన్ని వేల లక్షల మంది షేర్‌ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం నందమూరి అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్‌ చేస్తున్నారు.

సీనియర్ ఎన్టీఆర్‌ తన ఇద్దరు కొడుకులు మరియు కూతురుతో ఈ పొటోలో ఉన్నారు. ఎన్టీఆర్‌ ను ఈజీగా నే గుర్తించవచ్చు. కాని ఈ ఫొటోలో ఉన్న బుడతలను మాత్రం వెంటనే గుర్తించడం కాస్త కాదు ఎక్కువ కష్టమే. కనీసం గుర్తించడానిక కూడా వీలు లేనంతగా ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరు దివంగత హరికృష్ణ కాగా మరొకరు టాలీవుడ్‌ స్టార్‌ బాలకృష్ణ. వీరిద్దరు పొట్టి నెక్కర్లలో ఎంత క్యూట్‌ గా ఉన్నారో కదా. ఇక ఎన్టీఆర్ పక్కన స్కూల్ యూనిఫార్మ్‌ లో అంతకంటే క్యూట్‌ గా ఉన్నది మరెవరో కాదు చిన్నమ్మ పురందేశ్వరి.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫొటోను నందమూరి అభిమానులు తెగ షేర్‌ చేస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య మరియు పురందేశ్వరిల మద్య రాజకీయ విరుద్దం ఉంది. అయినా కూడా ఇద్దరి మద్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక హరికృష్ణ కూడా నందమూరి ఫ్యామిలీలో అందరితో సన్నిహితంగా ఉంటూ మంచి పేరు దక్కించుకున్నారు. ఎన్టీఆర్‌ ముగ్గురు పిల్లలతో స్టైల్‌ గా జేబులో చేయి పెట్టుకని నిల్చోవడం ఈ ఫొటోలో చూడవచ్చు.