Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : సౌత్ సీనియర్ తో బాలీవుడ్‌ హాట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   21 April 2022 7:30 AM GMT
పిక్ టాక్ : సౌత్ సీనియర్ తో బాలీవుడ్‌ హాట్ బ్యూటీ
X
సౌత్‌ స్టార్‌.. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం హిందీలో మేరీ క్రిస్మస్‌ అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా కత్రీనా కైఫ్‌ నటిస్తోంది. సౌత్‌ లో గతంలో సినిమాలు చేసిన కత్రీనా కైఫ్‌ హిందీలో బిజీ అయిన తర్వాత సౌత్‌ సినిమాలపై ఆసక్తి చూపించలేదు. చాలా కాలం తర్వాత సౌత్‌ నటుడితో స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు సిద్దం అయ్యింది.

ఈ సినిమాలో కీలక పాత్రలో రాధిక కనిపించబోతుంది. సీనియర్ హీరోయిన్ అయిన రాధిక ప్రస్తుతం సౌత్‌ లో మోస్ట్‌ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టు అనడంలో సందేహం లేదు. ఆమె వరుసగా తమిళం మరియు తెలుగు లో సినిమాలు చేస్తోంది.

ఈ సమయంలో హిందీలో మేరీ క్రిస్మస్‌ లో కూడా ఆమె నటించడం జరుగుతుంది. ప్రస్తుతం షూటింగ్‌ లో పాల్గొంటున్న రాధిక తో పాటు కత్రీనా కైఫ్‌ కూడా షూటింగ్‌ లో పాల్గొంటుంది.

షూటింగ్‌ సందర్బంగా వీరిద్దరు ఇలా ముచ్చట్లోకి జారి పోయారు. కత్రీనా కైఫ్‌ మరియు రాధికలు కలిసి ఉన్న ఈ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో కత్రీనా స్టార్‌ హీరోయిన్ కాగా.. రాధిక ఒకప్పుడు సౌత్ లో మోస్ట్ క్రేజీ అండ్ లక్కీ హీరోయిన్ గా పేరు దక్కించుకుని స్టార్‌ హీరోయిన్ గా నిలిచిన విషయం తెల్సిందే. అలాంటి వీరిద్దరి కలయిక అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సినిమాలో వీరిద్దరి పాత్రలు ఎలా ఉంటాయి అనేది క్లారిటీ లేదు. కాని ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి అనేది మాత్రం చాలా నమ్మకంగా ఉంది. ఈ సినిమాకు శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తుండగా విజయ్ సేతుపతి చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.