Begin typing your search above and press return to search.

పిక్ టాక్.. అందాల నిధే

By:  Tupaki Desk   |   10 July 2021 4:35 AM GMT
పిక్ టాక్.. అందాల నిధే
X
ప్ర‌స్తుత సౌత్ హీరోయిన్ల‌లో గ్లామ‌ర్ ప‌రంగా టాప్‌లో నిలిచే హీరోయిన్ల‌లో నిధి అగ‌ర్వాల్ ఒక‌రు. ఆమె అందాలు చూసి ఫిదా అయిపోయే కుర్ర‌కారు.. నిధి అంటూ స‌రైన పేరే పెట్టారు అంటూ కామెంట్లు చేస్తుంటారు. నిజంగా ఆమె ఒక అందాల నిధే అంటుంటారు. బాలీవుడ్లో ప్ర‌స్థానం మొద‌లుపెట్టి.. ఆ త‌ర్వాత సౌత్‌లో ల్యాండ్ అయిన నిధి ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేస్తోంది. తెలుగులో చేసిన తొలి రెండు చిత్రాలు స‌వ్య‌సాచి, మిస్ట‌ర్ మ‌జ్ను నిరాశ ప‌రిచినా.. మూడో చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్‌తో ఘ‌న‌విజ‌యాన్నందుకున్న నిధి.. అందులో చేసిన గ్లామ‌ర్ ట్రీట్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగే సంపాదించింది. ఈ మ‌ధ్యే భూమి, ఈశ్వ‌ర‌న్ సినిమాల‌తో త‌మిళంలోనూ ఆమె పాగా వేసింది.

సినిమాల్లో ఓ మోస్తరు హాట్‌గా క‌నిపించే నిధి.. సోష‌ల్ మీడియాలో మాత్రం హాట్నెస్ డోస్ బాగా పెంచేస్తుంటుంది. గ్లామ‌ర్ గ్యాల‌రీని మెయింటైన్ చేసే కుర్రాళ్లంద‌రూ అందులో నిధికి ఒక ఫోల్డ‌ర్ కేటాయించక త‌ప్ప‌దు అన్న‌ట్లుగా ఉంటాయి ఆమె ఫొటో షూట్లు చూస్తే. తాజాగా ఆరెంజ్ క‌ల‌ర్ టాప్‌లో అందాలు ఆర‌బోస్తూ మ‌త్తెక్కించే చూపుల‌తో కుర్రాళ్ల‌కు వల వేస్తున్న నిధి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇలా రెగ్యుల‌ర్‌గా గ్లామ‌ర్ ట్రీట్స్ ఇస్తూనే సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెంచుకుంటోంది నిధి. ఇక ఆమె సినీ కెరీర్‌కు కూడా ఏమాత్రం ఢోకా లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుతో పాటు ఆమె చేతిలో క్రేజీ చిత్రాలున్నాయి.