Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : కైపెక్కించే అందాల విందు

By:  Tupaki Desk   |   13 Jan 2022 4:34 AM GMT
ఫొటోటాక్ : కైపెక్కించే అందాల విందు
X
బాలీవుడ్‌ తో కాటు టాలీవుడ్‌ లో కూడా సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్న ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్‌. ఈ రాజస్థాన్ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫొటోలు మరియు వీడియోలు ఫాలోవర్స్ ను తెగ కవ్విస్తూనే ఉన్నాయి. రెగ్యులర్ గా హాట్‌ ఫొటోలు షేర్‌ చేసే ఈ అమ్మడు తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటో కవ్విస్తూ ఉంది. కుర్రకారుకు కైపెక్కించే విధంగా ఉన్న ఈ అమ్మడి అందాల విందు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. సముద్రపు ఒడ్డున ఉన్న ఈ అమ్మడి అందం మరింత పెరిగింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సముద్రం అందం కంటే కూడా ఈ అమ్మడి అందం మురిపిస్తుందని.. మైమరిపిస్తుందని నెటిజన్స్ నుండి రెస్పాన్స్ వస్తుంది. మరింతగా అందరి దృష్టిని ఆకర్షించేందుకు గాను ఈమె ముందు పండ్ల బుట్టను పెట్టుకుంది. ఆ పండ్లను మించిన అందం.. తన అందం అన్నట్లుగా ఈ అమ్మడు సింబాలిక్ గా చెప్పకనే చెబుతుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మడు తన థైస్ మరియు ఎక్స్ పోజింగ్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే మొదట ఈమె బుల్లి తెరపై సందడి చేసింది. ఆ తర్వాత హిందీ లో 2017 లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లో అదే ఏడాది మళ్లీ రావా అనే సినిమా తో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. ఆ వెంటనే దేవదాస్ సినిమాలో కూడా నటించింది. దేవదాస్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి హిందీ మరియు ఇతర భాషల సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు లో నాని నిర్మిస్తున్న 'మీట్ క్యూట్‌' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా చాలా స్పెషల్‌ గా ఉంటుందని నాని అంటున్నాడు. కనుక ఈ సినిమా తో అయినా ఆకాంక్ష సింగ్ కు తెలుగు లో మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాలి.