Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టోన్డ్ లెగ్స్ ని ప్ర‌ద‌ర్శిస్తున్న సామ్

By:  Tupaki Desk   |   13 July 2022 5:30 AM GMT
ఫోటో స్టోరి: టోన్డ్ లెగ్స్ ని ప్ర‌ద‌ర్శిస్తున్న సామ్
X
ఇటీవ‌లి కాలంలో నిరంత‌రం నేష‌న‌ల్ మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది అందాల స‌మంత‌. చైత‌న్య‌తో బ్రేక‌ప్ వ్య‌వ‌హారం.. ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2 లో రాజీ పాత్ర‌.. పుష్ప‌లో ఊ అంటావా సాంగ్.. ఇటీవ‌ల కాఫీ విత్ క‌ర‌ణ్ షో .. ఇలా ప్ర‌తిదీ స‌మంత‌ను లైమ్ లైట్ లో ఉంచాయి. ప్ర‌స్తుతం నార్త్ లో సామ్ పేరు మార్మోగుతోంది. త‌న‌కు అక్క‌డ భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

అదే క్ర‌మంలో సమంత బాలీవుడ్ లో స్పీడ్ పెంచింది. అలాగే అవ‌స‌రం మేర‌కు లుక్ ప‌రంగానూ చాలా మార్పులు చేస్తోంది. దీనికోసం జిమ్ లో నిరంత‌రం శ్ర‌మిస్తోంది. ఇప్పుడు స‌మంత టోన్డ్ ఫిజిక్ ని ప్ర‌ద‌ర్శించేందుకు ఉన్న ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డం లేదు. తాజాగా సామ్ టోన్డ్ బాడీ.. టోన్డ్ లెగ్స్ ని ఆవిష్క‌రిస్తూ పింక్ డిజైన‌ర్ ఫ్రాకులో హొయ‌లు పోయిన తీరు యువ‌త‌రంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఒక ఫిట్నెస్ ఫ్రీక్ గా ఈ లుక్ పాజిబుల్ అయ్యింది. సామ్ ముద్ద బంతి చందం అంటూ అభిమానులు పొగిడేస్తుండ‌గా.. కొంద‌రు టోన్డ్ లెగ్స్ సౌంద‌ర్యానికి కితాబిచ్చేస్తున్నారు. ఈ పిక్స్ ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.

డూప్ అల‌వాటు లేదు!స‌మంత న‌టించిన య‌శోద‌- శాకుంత‌లం చిత్రాలు విడుద‌ల‌కు రావాల్సి ఉంది. ఇక తాజా ఇంట‌ర్వ్యూలో యశోద గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాల కోసం బాడీ డబుల్స్ కి సమంత నో చెప్పిందని దర్శక ద్వయం హరి-హరీష్ వెల్ల‌డించారు. య‌శోద‌కు సామ్ త‌మ తొలి ఎంపిక అని వెల్లడించారు. భారతదేశపు మొట్టమొదటి వ్యూపాయింట్ చిత్రం ఓర్ ఎరవూ .. అలాగే అంబులి ( మొదటి స్టీరియోస్కోపిక్ 3D త‌మిళ చిత్రం మేక‌ర్స్) చిత్రాల మేక‌ర్స్ గా వారు య‌శోద‌తో మ‌రో కొత్త త‌ర‌హా జాన‌ర్ ని ట‌చ్ చేస్తున్నారు.

ఇదే విష‌య‌మై ప్ర‌స్థావిస్తూ.. ''మాకు అన్ని ర‌కాలుగా గుర్తింపు ఉంది. అవార్డులు ఉన్నాయి. కానీ ఈసారి ప్రధాన స్రవంతి ప్రేక్షకులకు చేరువవ్వాలని విభిన్నమైన అంశాల‌ను తెర‌పై చూపించాల‌ని భావించాం. అందుకే మా చివరి చిత్రం తర్వాత విరామం తీసుకున్నాం. యశోద కోసం 2 సంవత్సరాలు పని చేసాము'' అని హరి- హరీష్ ద్వ‌యం అన్నారు.

మెజారిటీ ఆడియెన్ అంచనాలను అందుకోవడానికి కమర్షియల్ క‌థ‌లే కాకుండా విభిన్నమైన అంశాల‌ను అర్థం చేసుకోగల స్టార్ ని మేము సంప్రదించాలనుకున్నాం. బాగా నటించగల అసమానమైన స్టార్ డమ్ ఉన్న న‌టిని ఎంపిక చేయాల‌నుకున్నాం. మా మొదటి ఎంపిక సమంత. అదృష్టవశాత్తూ మొదటి సమావేశం జరిగిన నిమిషాల్లో ఆమె అవును అని చెప్పింది.. అని ద‌ర్శ‌కులు తెలిపారు. క‌థ‌నం విన్న త‌ర్వాత ''నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.. ఈ సినిమా చేయాలనుకుంటున్నాను'' అని స‌మంత చెప్పారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 చిత్రీక‌ర‌ణ‌కు ముందే యశోద కోసం సామ్ ను సంప్రదించినట్లు దర్శకులు వెల్లడించారు.

పాన్-ఇండియా సినిమా ఇది. అయినా యాక్షన్ సన్నివేశాల కోసం సామ్ ఎలాంటి సహాయం తీసుకోవడానికి నిరాకరించింది అని కూడా వెల్లడించారు. సినిమాలోని ప్రధాన యాక్షన్ భాగం సెట్స్ లో చిత్రీకరించాం.. ఫైట్ సీక్వెన్స్ కోసం సామ్ 2 లేదా 3 రోజుల పాటు రిహార్సల్స్ చేసేవారు. ఆమె అన్ని సన్నివేశాలను స్వయంగా చేయాలని కోరుకుంది. బాడీ డ‌బుల్ కి నో చెప్పింది.. అని కూడా వెల్ల‌డించారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యాన్నిక్ బెన్ - వెంకట్ మాస్టర్లు యశోదలో భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు.