Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: రవితేజ 'రావణాసుర' లో రామ్ గా అక్కినేని హీరో..!

By:  Tupaki Desk   |   11 Jan 2022 11:39 AM GMT
ఫస్ట్ లుక్: రవితేజ రావణాసుర లో రామ్ గా అక్కినేని హీరో..!
X
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో తెరకెక్కుతున్న 70వ చిత్రం "రావణాసుర''. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నావెల్ కాన్సెప్ట్‌ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ మూవీలో అక్కినేని యువ హీరో సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్మాతలు తాజాగా ప్రకటించారు.

'రావణాసుర' సినిమాలో రామ్‌ అనే పాత్రలో సుశాంత్ కనిపించనున్నారు. 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్‌ బస్టర్ చిత్రంలో భాగమైన అక్కినేని హీరో.. ఇప్పుడు రవితేజ స్క్రిప్ట్ నచ్చడంతో ముఖ్య పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుశాంత్‌ ప్రెజెన్స్‌ ఈ సినిమాకు పెద్ద బోనస్‌ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.

తాజాగా 'రావణాసుర' చిత్రం నుంచి సుశాంత్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో యువ హీరో నీలం కళ్ళు, పొడవాటి జుట్టు - గడ్డంతో పోస్టర్‌ లో చాలా దృఢంగా కనిపిస్తున్నాడు. అతను రామ్ అయినప్పటికీ, 'హీరోలు ఉనికిలో లేరు.. కానీ రాక్షసులు ఉన్నారు' అనే క్యాప్షన్ ని బట్టి చూస్తే సుశాంత్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని అర్థం అవుతుంది.

ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మంచి అవకాశం వచ్చినప్పుడు ఇతర పాత్రలు చేయడానికి సుశాంత్ వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఇటీవల 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో పలకరించిన సుశాంత్ కు.. 'రావణాసుర' సినిమా ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.

ఇకపోతే ఈ చిత్రంలో రవితేజ లాయర్‌ గా కనిపించనున్నారు. దీపావళి సందర్భంగా విడుదల చేసిన దశముఖ మాస్ రాజా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి ప్రశంసలు అందుకుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 14న హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ లో 'రావణాసుర' పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నెల నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ మీద నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి పవర్ ఫుల్ స్టోరీ అందిస్తున్నారు. స్టైలిష్ టేకింగ్ నైపుణ్యానికి పేరుగాంచిన సుధీర్ వర్మ ఈ చిత్రంలో రవితేజను మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో చూపించనున్నారు.

'రావణాసుర' చిత్రంలో రవితేజ ఎలాంటి విలక్షణమైన పాత్రను పోషించనున్నాడనేది ఫస్ట్ లుక్ పోస్టర్‌ తెలియజేస్తోంది. ఇప్పుడు దీనికి సుశాంత్ కూడా జత కలుస్తున్నారు. వీరితో పాటుగా కొంతమంది ప్రముఖ నటీనటులు మరియు టాప్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్‌ లో భాగం కానున్నారు.