Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: 'రంగం'లోకి దిగేసిందిగా

By:  Tupaki Desk   |   29 Jun 2017 5:08 PM GMT
ఫోటో స్టోరి: రంగంలోకి దిగేసిందిగా
X
ఉత్తరాది భామ పియా బాజ్ పాయ్ కు దక్షిణాదిలోనే క్రేజ్ ఎక్కువ. తమిళ్.. తెలుగు.. మలయాళంతో పాటు కొన్ని హిందీ సినిమాల్లో కూడా కనిపించిన ఈ భామను.. జనాలు బాగా గుర్తు పెట్టుకున్న మూవీ రంగం. తమిళ్ 'కో' చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ గా వచ్చిన రంగంలో 'సరో'(సరస్వతి) పాత్రలో నటించి.. మెప్పించిన ఈ బ్యూటీకి.. ఆ తర్వాత మళ్లీ బ్రేక్ రాలేదు.

ఇప్పటికీ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నా అవేమీ బడా ప్రాజెక్టులు కాదు. ప్రస్తుతం పాతికేళ్ల పియా బాజ్ పాయ్.. తనలోని ఫుల్లు ట్యాలెంట్ చూపించేయాలని ఫిక్స్ అయిపోయింది. రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్ చూస్తే మతులు పోవాల్సిందే. వైట్ కలర్ షార్ట్ డ్రెస్సులో తనలోని ఎన్నో యాంగిల్స్ ను చూపించేసింది పియా బాజ్ పాయ్. తన మేని మెరుపులను ఎంతో అందంగా వయ్యారంగా చూపించేస్తూ.. నడుం మడతలను కొలతలు వేసుకోమన్నట్లుగా పోజులు ఇచ్చేసి.. అందాల ఆరబోతతో తను రంగంలోకి దూకేశానని చెప్పేసింది పియా బాజ్ పాయ్.

నాభికి కొన్ని అంగుళాల కిందవరకూ.. మోకాలికి అడుగు పైగా పై వరకూ చిన్నపాటి షార్ట్ తో తనలోని అందాలను మరింత అందంగా ప్రదర్శించేసింది పియా బాజ్ పాయ్. ఈ భామకు అందాలు చూపించడం కొత్తేమీ కాదు కానీ.. ఈ సారి కొత్తగా మరింత అందంగా ప్రయత్నించేసింది. మరి ఈ అందానికి అవకాశాలు ఎలా అందుతాయో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/