Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : ముద్దుగుమ్మతో విక్రాంత్ రానా

By:  Tupaki Desk   |   18 July 2021 5:48 AM GMT
ఫొటోటాక్ : ముద్దుగుమ్మతో విక్రాంత్ రానా
X
కన్నడ స్టార్‌ హీరో కిచ్చ సుదీప్ నటిస్తున్న విక్రాంత్ రానా భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్దం అవుతోంది. కన్నడ సినిమాలకు ఒకప్పుడు పెద్దగా బయట భాషల్లో మార్కెట్‌ ఉండేది కాదు. కాని ఎప్పుడైతే కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో అప్పటి నుండి కన్నడ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయ్యేందుకు భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్నాయి. ప్రస్తుతం సుదీప్ కిచ్చ హీరోగా నటిస్తున్న విక్రాంత్ రానా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. కన్నడంలోనే కాకుండా సౌత్‌ లో అన్ని భాషల్లో మరియు బాలీవుడ్ లో కూడా విడుదల చేసేందుకు గాను ప్రమోషన్ కార్యక్రమాలు ప్లాన్‌ చేస్తున్నారు.

సౌత్ లో అన్ని భాషల వారికి సుపరిచితుడు అయిన సుదీప్‌ బాలీవుడ్‌ లో కూడా అడపా దడపా సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక బాలీవుడ్‌ లో స్టార్‌ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో ఈ సినిమా లో చిన్న పాత్ర చేయించారు. దాంతో బాలీవుడ్‌ వర్గాల వారి దృష్టిని ఈ సినిమా ఆకర్షిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఇటీవలే జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తో ఈ అమ్మడి షూటింగ్‌ జరిగింది. సినిమా షూటింగ్ ముగిసిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు వీరి ఫొటో షూట్ ను షేర్‌ చేశారు.

సుదీప్ మరియు జాక్వెలిన్ ల జోడీకి ఖచ్చితంగా బాలీవుడ్‌ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ సీన్స్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ మేకర్స్ చిత్రీకరించారట. సినిమాకు ఆమె నటించిన సీన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయని అంటున్నారు. ఇక ఈ సినిమాను త్రీడి ఫార్మట్‌ లో విడుదల చేసేందుకు గాను ప్లాన్‌ చేస్తున్నారట. దేశ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా డబ్బింగ్ వర్షన్ లను విడుదల చేయబోతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా ఆగస్టులో విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా విడుదల ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. పెద్ద మొత్తం లో ఖర్చు పెట్టి తెరకెక్కించిన సినిమా అవ్వడం వల్ల కాస్త మంచి టైమ్‌ జోన్‌ లో విడుదల చేయాలనే మేకర్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ ను జరుపుతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. తెలుగు ఆడియన్స్‌ కు ఈగ సినిమా తో సుపరిచితుడు అయిన సుదీప్‌ ఆ తర్వాత బాహుబలి సినిమా లో కూడా కనిపించి మెప్పించాడు. ఇంకా తెలుగులో ఈయన నటించిన సినిమాలు చాలానే వచ్చాయి. అందుకే ఈ సినిమా తెలుగులో డైరెక్ట్‌ తెలుగు సినిమా మాదిరిగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్నారని కూడా తెలుస్తోంది. విడుదల తేదీ విషయంలో మరి కొన్ని రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.