Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : కుర్రకారు పూజా ఇలాంటి టైట్‌ డ్రస్ లతో ఇబ్బంది

By:  Tupaki Desk   |   8 March 2022 10:30 AM GMT
ఫోటోటాక్‌ : కుర్రకారు పూజా ఇలాంటి టైట్‌ డ్రస్ లతో ఇబ్బంది
X
టాలీవుడ్‌ మోస్ట్‌ క్రేజీ అండ్‌ లక్కీ బ్యూటీ పూజా హెగ్డే మరో రెండు రోజుల్లో రాధేశ్యామ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తన హాట్‌ ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంది. ఇదే సమయంలో ఈ అమ్మడి జిమ్‌ డ్రస్ లోని ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. వర్కౌట్‌ చేసే సమయంలో టైట్‌ డ్రస్ తో అలాగే పూజా హెగ్డే బయటకు రావడంతో ఫోటోగ్రాఫర్‌ లు తమ కెమెరాలకు పని చెప్పారు.

ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరీ ఇంత టైట్‌ డ్రస్ లో అందాలను పూర్తిగా చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చి కుర్ర కారును ఇబ్బంది పెడుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలు ఎంత మంది కుర్రాళ్లను ఇబ్బంది పెట్టాయో కదా అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.

ఇలాంటి ఫోటో షూట్స్‌ ఎన్నో ఈ అమ్మడు షేర్‌ చేసి కుర్రాళ్ల జీవితాలతో ఆడుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తుందంటూ సరదాగా విమర్శలు వస్తున్నాయి.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే గత నాలుగు సంవత్సరాలుగా ఈమె అభిమానులు ఎదురు చూస్తున్న రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటించింది. పాన్ ఇండియా మూవీ అవ్వడంతో పాటు ప్రభాస్ కు జోడీగా.. అది కాకుండా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాలో ఆమెను చూపించాడని ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు వీడియోలతో క్లారిటీ వచ్చింది. మరో వైపు ఈమె తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ తో కలిసి నటించిన బీస్ట్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఇటీవల విడుదల అయిన అరబిక్ కుత్తు తో ఈ అమ్మడు సంచలనం సృష్టించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరో వైపు ఈమె బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తో ఒక సినిమా ను మరియు టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ తో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోంది. ఇన్ని భారీ సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఇలా వర్కౌట్‌ లు చేసిన డ్రస్ లతో నేరుగా బయటకు వచ్చేస్తే జనాలు గుండె పోట్లు వచ్చి పోతారు. ముఖ్యంగా కుర్ర కారు మతులు పోగొట్టుకుని ఇబ్బందులు పడే అవకాశం ఉంది అంటున్నారు.