Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : ఎడాది దేశంలో దొరసాని అందాల విందు

By:  Tupaki Desk   |   1 April 2022 8:30 AM GMT
ఫోటోటాక్‌ : ఎడాది దేశంలో దొరసాని అందాల విందు
X
జీవిత రాజశేఖర్ దంపతుల కుమార్తెలు అయిన శివాని మరియు శివాత్మికలు ఇద్దరు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. శివాత్మిక దొరసాని సినిమా తో తెలుగు ప్రేక్షకులు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి పేరు దక్కించుకుంది. ఆ సినిమా కమర్షియల్‌ గా ఆడకున్నా కూడా శివాత్మిక కు మంచి పేరు రావడంతో ఆ తర్వాత పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఆచితూచి సినిమాలను ఎంపిక చేస్తున్న శివాత్మిక ఇప్పటి వరకు స్కిన్‌ షో కు దూరంగా ఉంది.

ఇక నుండి కమర్షియల్‌ హీరోయిన్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఖచ్చితంగా అందాల ప్రదర్శణ చేయాలని శివాత్మిక భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే ఇటీవల కాలంలో ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫోటోలు ఆమె అందంను మరింతగా పెంచి చూపిస్తున్నాయి. స్కిన్‌ షో అనగానే వల్గర్ గా కాకుండా శివాత్మిక చాలా అందంగా స్కిన్‌ షో చేస్తుందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సహజంగా స్టార్‌ హీరో కూతురు లేదా హీరోయిన్ కూతురు స్కిన్‌ షో చేస్తే సౌత్‌ ఆడియన్స్ ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపించరు.

కాని శివాత్మిక విషయంలో మాత్రం అలా జరగడం లేదు. సోషల్‌ మీడియాలో శివాత్మిక షేర్‌ చేసే ఫోటోలకు మంచి టాక్‌ వస్తుంది. మెజార్టీ నెటిజన్స్ ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

శివాత్మిక హీరోయిన్‌ గా ముందు ముందు రాబోతున్న సినిమాల్లో ఎక్స్ పోజింగ్‌ కూడా ఉంటుందని దీన్ని బట్టి అర్థం అవుతుంది. ప్రస్తుతం ఎడారి దేశం దుబాయి లో ఈమె సందడి చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. దుబాయి లో స్కిన్ షో తో శివాత్మిక ప్రేక్షకులను మరియు నెటిజన్స్ ను ఆకర్షిస్తోంది.

హీరోయిన్‌ గా శివాత్మిక పలు సినిమాల్లో నటిస్తుంది. ఆ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోయే ఏడాది కాలంలో విడుదల అవుతాయని అంటున్నారు. అందులో రంగమార్తాండ సినిమా కూడా ఒకటి ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో శివాత్మిక పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట. ఆ పాత్ర ఈమెకు చాలా గుర్తింపు తెచ్చి పెడుతుందనే నమ్మకంను కూడా వ్యక్తం చేస్తున్నారు.