Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః 'జాతి రత్నాలు'కు ఆర్‌ఆర్‌ఆర్ నుండి సర్‌ ప్రైజ్‌

By:  Tupaki Desk   |   12 March 2021 6:33 AM GMT
ఫొటోటాక్‌ః జాతి రత్నాలుకు ఆర్‌ఆర్‌ఆర్ నుండి సర్‌ ప్రైజ్‌
X
మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ జాతి రత్నాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రమోషన్‌ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు చేసిన హంగామాతో ఈ సినిమా ఖచ్చితంగా మంచి ఎంటర్ టైన్‌ మెంట్‌ ను అందిస్తుందని ప్రేక్షకులు భావించారు. అనుకున్నట్లుగానే ఎంటర్‌ టైన్ మెంట్‌ విషయంలో నూటికి నూరు శాతం ప్రేక్షకులు సంతృప్తి పర్చే విధంగా ఉందంటూ సోషల్ మీడియా టాక్ వచ్చింది. ఈ సినిమాకు సినీ ప్రముఖులు పలువురు సపోర్ట్‌ గా నిలిచారు. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్‌ సినిమా యూనిట్‌ నుండి కూడా జాతి రత్నాలకు సపోర్ట్‌ ఈ విధంగా లభించింది.

జాతి రత్నాల్లో నవీన్‌ పొలిశెట్టి.. ప్రియదర్శి.. రాహుల్‌ రామకృష్ణ ఒక చిల్లర గ్యాంగ్ గా ఉంటారు. వారి పోస్టర్ లు చాలా వరకు ట్రెండ్ అయ్యాయి. అందులో ఒక పోస్టర్‌ ను ఇలా రాజమౌళి.. ఎన్టీఆర్‌.. చరణ్‌ లతో మార్ఫ్‌ చేసి జాతి రత్నాలు టీమ్ కు చిన్న సర్‌ ప్రైజ్ అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ సోషల్‌ మీడియా అధికారిక పేజీల్లో షేర్ చేసి బెస్ట్‌ విషెష్‌ ను తెలియజేశారు. జక్కన్న టీమ్‌ నుండి జాతి రత్నాలు బెస్ట్‌ విషెష్‌ ను అందుకోవడంతో పాటు ఆ ముగ్గురు కూడా జాతి రత్నాలు పోస్టర్ లో ఎక్కడంతో సినిమా క్రేజ్ మరింతగా పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.