Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః కరోనా ఎంత పని చేసిందో చూడండి

By:  Tupaki Desk   |   28 May 2021 8:00 AM IST
ఫొటోటాక్‌ః కరోనా ఎంత పని చేసిందో చూడండి
X
కరోనా కారణంగా సెలబ్రెటీలు పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో వీడియో లు ఫొటోలు షేర్‌ చేస్తూ సరదాగా సమయాన్ని గడిపేస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో చాలా కాలం తర్వాత టైమ్ గడుపుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తుంటే ఒక హీరోయిన్ మాత్రం తమ తోటలో సరదాగా వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబ సభ్యులతో గడిపేస్తోంది. ఆమె కన్నడ నటి ఆశికా రంగనాథ్‌. తన ఫామ్‌ హౌస్‌ లో కుటుంబ సభ్యులతో తోట పని చేస్తూ టైమ్‌ గడుపుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా పేర్కొంది.

2016 లో క్రేజీ బాయ్‌ సినిమా తో హీరోయిన్‌ గా పరిచయం అయిన ఆశికా రంగనాథ్‌ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ఈ ఏడాది ఈమె నటిస్తున్న సినిమాలు నాలుగు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న ఆశికా కరోనా కారణంగా తోట పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కరోనా వచ్చి ఉండకుంటే ఈమె నటిస్తున్న సినిమాలు ఈ ఏడాది వరుసగా కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. మరి కొన్ని సినిమాలు కూడా కొత్తగా ఆమె ఖాతాలో పడేవి. పాపం కరోనా ఎంత పని చేసిందో చూడండి అంటూ ఆశికా షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ లకు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.