Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : పుష్ప పోజ్ తో చిల్‌ అవుతున్న రష్మిక

By:  Tupaki Desk   |   12 Dec 2021 12:03 PM GMT
ఫొటోటాక్ : పుష్ప పోజ్ తో చిల్‌ అవుతున్న రష్మిక
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలోనే విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సినిమా కు సంబంధించినంత వరకు అభిమానుల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు సినిమా గురించి మీడియాలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయడం వల్ల అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. పుష్ప సినిమా చిత్రీకరణ ఆరంభం అయిన కొన్ని రోజులకే అల్లు అర్జున్‌ బైక్ పై కూర్చుని చేయి అలా పైకి ఎత్తి చూపించే స్టిల్‌ ఒకటి విడుదల అయ్యింది. ఆ స్టిల్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ స్టిల్‌ బాగా నచ్చిందనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు రష్మిక సరదాగా ఆ స్టిల్ ను రీ క్రియేట్‌ చేసే ప్రయత్నం చేసింది.

రష్మిక ఇన్‌ స్టాలో షేర్ చేసిన ఈ చిల్లింగ్‌ ఫొటో వైరల్‌ అవుతోంది. అల్లు అర్జున్‌ కటౌట్ కు ముందు వైపు నిల్చుని బన్నీ ఫోజ్‌ ను ఇమిటేట్‌ చేసింది. పుష్ప రాజ్ లా ఉండేందుకు ప్రయత్నిస్తూ చిల్‌ అవుతున్నాను అంటూ ఫొటో కు కామెంట్‌ పెట్టింది. అల్లు అర్జున్ తో నటించడం వల్ల ఈ అమ్మడి స్థాయి పాన్ ఇండియా మార్కెట్‌ లో అమాంతం పెరుగుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. రష్మిక డీ గ్లామర్ గా కనిపిస్తూనే కావాల్సినంత స్కిన్‌ షో చేసిందనే టాక్ ఉంది. సినిమా విడుదల తర్వాత ఈసారి అందంతో కాకుండా మంచి నటనతో రష్మిక ఆకట్టుకుంది అంటూ అభిమానులు అనుకునేలా చేస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

పుష్ప సినిమా లో బన్నీ మరియు రష్మికల మాస్ లుక్‌ మరీ ఇబ్బంది కరంగా కాకుండా రంగస్థలం సినిమా లో రామ్‌ చరణ్ మరియు సమంతల ను చూపించిన విధంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రష్మిక మందన్నా ఇప్పటి వరకు కనిపించని లుక్ లో కనిపించబోతుంది. అల్లు అర్జున్ మరియు రష్మికల మద్యలో ఉండే కెమిస్ట్రీ మరియు ఇద్దరి కాంబో సన్నివేశాల కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ మరియు రష్మిక మందన్నల మద్య ఉండే రొమాంటిక్ సన్నివేశాలు మరియు లవ్‌ సీన్స్ కు సంబంధించిన విషయాలు చర్చ కు వస్తున్నాయి. పుష్ప సినిమా ఆహా ఓహో అన్నట్లుగా ఉంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.