Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : అందంతో రెచ్చగొడుతున్న ప్రభాస్ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   18 Jun 2022 2:30 AM GMT
ఫోటోటాక్ : అందంతో రెచ్చగొడుతున్న ప్రభాస్ హీరోయిన్‌
X
బాలీవుడ్‌ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ కృతి సనన్‌. ఈ అమ్మడి మొదటి సినిమా తెలుగు లో అనే విషయం తెల్సిందే. సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమా తో హీరోయిన్ గా కృతి సనన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలోనే తన అందంతో అలరించిన ఈ అమ్మడికి లక్ కలిసి రాక తెలుగు లో పెద్దగా ఆఫర్లు రాలేదు.

మొదటి సినిమా నిరాశ పర్చినా హిందీలో అవకాశం ను దక్కించుకుంది. తెలుగు లో దోచెయ్‌ అనే సినిమా లో నాగ చైతన్యకు జోడీగా నటించి మెప్పించింది.

ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా లో నటించలేదు. కాని ప్రస్తుతం తెలుగు స్టార్‌ ప్రభాస్ కు జోడీగా హిందీ సినిమా ఆదిపురుష్‌ లో నటించింది. సీత పాత్రలో ప్రభాస్ కు జోడీగా నటించిన కృతి సనన్ మళ్లీ సౌత్ లో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే హీరోయిన్ కృతి సనన్ రెగ్యులర్ గా తన హాట్‌ ఫోటో షూట్స్ ను ఇన్ స్టా లో షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ ఫోటోను షేర్‌ చేసి తన ఫాలోవర్స్ తో పాటు కుర్రకారు అందరిని కూడా రెచ్చగొడుతున్నట్లుగా ఫోజ్ ఇచ్చింది. థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ అందాల విందు చేయడం ఈమద్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ ను చూశాం.

కాని ఈ అమ్మడు చాలా స్పెషల్‌ గా అనిపిస్తుంది. కారణం ఈమె పొడుగు కాళ్ల సుందరి అనే పేరును దక్కించుకుంది. హీరోయిన్‌ గా ఈ అమ్మడు ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా నటిస్తుందనే పేరును దక్కించుకుంది. అందుకే ఈ అమ్మడికి స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. తాజాగా షేర్ చేసిన ఈ పోటో చూస్తే ఫిల్మ్‌ మేకర్స్ మరిన్ని ఆఫర్లు ఆమెకు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.