Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : టాప్‌ యాంగిల్‌ లో అమ్మడి అందం అదుర్స్‌

By:  Tupaki Desk   |   9 Nov 2021 12:30 PM GMT
ఫొటోటాక్ : టాప్‌ యాంగిల్‌ లో అమ్మడి అందం అదుర్స్‌
X
ఆర్‌ఎక్స్ 100 సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్ పూత్‌. మొదటి సినిమాలోనే ముద్దు సీన్నివేశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంతో పాటు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా కనిపించింది. ఒక్క సినిమాలోనే ఎన్నో వేరియేషన్స్ ను చూపించిన పాయల్‌ రాజ్ పూత్‌ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ కాకున్నా చిన్న హీరోలకు ఈమె మోస్ట్‌ వాంటెడ్‌ గా మారిపోయింది. లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ లు కూడా ఈమె వద్దకు వస్తున్నాయి. వరుసగా ఈమె హాట్ ఫొటో షూట్స్ ను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేస్తే సినిమాల్లో హాట్ గా నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్లుగా హింట్ ఇస్తుంది అనిపిస్తుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫొటో నెక్ట్స్‌ లెవల్‌ అరాచకం అన్నట్లుగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే క్లీవేజ్ షో తో గతంలో ఎన్నో సార్లు పాయల్‌ రాజ్ పూత్‌ ఫొటోలను షేర్‌ చేసింది. ఎన్ని రకాల హాట్ ఫొటోలు షేర్‌ చేసినా కూడా పాయల్ రాజ్ పూత్‌ చాలా గ్లామర్ గా ఉంటుందే తప్ప ఆమె ఎక్కడ కూడా వల్గర్ గా కనిపించిన దాఖలాలు లేవు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటూ ఉంటారు. తాజాగా టాప్ యాంగిల్ లో ఉన్న కెమెరాకు అందంగా ఫోజ్ ఇచ్చిన పాయల్‌ రాజ్ పూత్ మరోసారి ఆకట్టుకుంది. ఏ యాంగిల్‌ లో అయినా కూడా పాయల్‌ అందంగా కనిపిస్తుందని మరోసారి నిరూపితం అయ్యిందని ఈ ఫొటో తో తేలిపోయింది.

టాప్ యాంగిల్ లో కెమెరాకు క్లీవేజ్ షో ఇచ్చినా కూడా చాలా క్యూట్‌ గా అందంగా కనిపిస్తూ ఏమాత్రం వల్గర్‌ లేకుండా పాయల్ అందంగా కనిపించి అదుర్స్ అనిపిస్తుంది. ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌ మెటీరియల్‌ అని.. ఖచ్చితంగా ముందు ముందు అయినా ఈమెకు స్టార్ హీరోల నుండి ఆఫర్లు వస్తాయనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పాయల్ ఈమద్య కాలంలో నటించిన సినిమాలు.. నటిస్తున్న సినిమాలు వరుసగా వచ్చే ఏడాదిలో బాక్సాఫీస్‌ వద్దకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ లో కూడా నటిస్తోంది. వెబ్‌ మూవీస్ ను కూడా చేసిన పాయల్‌ ఏ ఒక్క అవకాశంను వదులుకోకుండా తనవంతుగా ఎంటర్ టైన్ మెంట్‌ ను అందిస్తుంది.