Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : లోఫర్ బ్యూటీ స్వీట్ హాట్ సెల్ఫీ

By:  Tupaki Desk   |   22 Nov 2021 5:04 AM GMT
ఫొటోటాక్ : లోఫర్ బ్యూటీ స్వీట్ హాట్ సెల్ఫీ
X
తెలుగు ప్రేక్షకుల ముందుకు లోఫర్ సినిమాతో వచ్చిన దిశా పటానీ ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యింది. అక్కడ భారీ ఎత్తున అందాలు ఆరబోస్తూ స్టార్‌ హీరోల సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుని వరుసగా బాలీవుడ్ లో భారీ చిత్రాలు చేస్తూ వస్తోంది. బాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్స్ లో ఒకరుగా దిశా పటాని నిలిచింది. టాలీవుడ్‌ లో మళ్లీ ఈ అమ్మడు ఎప్పుడు అడుగు పెడుతుందా అంటూ అంతాఆ సక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

హాట్ ఫొటో షూట్స్ తో పాటు ఆకట్టుకునే అంద చందాలను ఈ అమ్మడు సెల్పీల్లో బంధించి ఏమాత్రం తగ్గకుండా అందాలను ప్రదర్శిస్తూ వస్తోంది. తాజాగా ఈ ఫొటోలో సెల్ఫీ తీసుకుని నడుము అందం చూపించింది. నడుము సన్నగా వావ్ అనేట్లుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం మరీ ఇంత సన్న నడుము ఏంటి అమ్మడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మడి తాజా నడుము సెల్ఫీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ముద్దుగుమ్మ దిశా పటానీ హిందీలో ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో రెండు మూడు సినిమాలు అయినా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈమె కొన్నాళ్లుగా బాలీవుడ్ కు చెందిన ఒక యంగ్‌ స్టార్ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై ఇప్పటికే మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీరు ఇద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.