Begin typing your search above and press return to search.

ఫోటోటాక్: కాజ‌ల్ ఓల్డ్ క్లిక్..ఫ్యాన్స్ కి న్యూ కిక్

By:  Tupaki Desk   |   24 March 2022 10:30 AM GMT
ఫోటోటాక్: కాజ‌ల్ ఓల్డ్ క్లిక్..ఫ్యాన్స్ కి న్యూ కిక్
X
చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కొన్ని నెల‌లుగా బేబి బంప్ లుక్ తో ఇన్ స్టాలో ద‌ర్శ‌న‌మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాజ‌ల్ గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర నుంచి బేబి బంప్ ఫోటోల్ని ఇన్ స్టాలోకి అదే ప‌నిగా డంప్ చేస్తుంది. బుజ్జాయి ఊహ‌ల్లో తేలుతూ అదే రెట్టించిన ఉత్సాంహంతో ఫోటో సెష‌న్స్ లో పాల్గొంటుంది. విభిన్న ర‌కాల క్యాజువ‌ల్ వేర్స్ లో బేబి బంప్ లుక్ తో నెటి జ‌నుల్ని ఆక‌ట్టుకుంటుంది.

ఇప్ప‌టివ‌ర‌కూ వారంలో మూడు ..నాలుగు ఫోటోలు చెప్పున క‌వ‌ర్ చేసుకుంటూ వ‌చ్చింది. తాజాగా బంప్ లుక్ కి గ్యాప్ ఇచ్చింది బ్యూటీ. ఓ పాత ఫోటోని ఇన్ స్టాలో అభిమానుల కోసం పండ‌గ చేస్కోండ‌ని షేర్ చేసింది. లైట్ ఎల్లో క‌ల‌ర్ దుస్తుల్లో కాజ‌ల్ గ‌ర్భం దాల్చ‌క ముందు క్యాప్చ‌ర్ చేసిన కొన్ని ఫోటోల్ని సోష‌ల్ మీడియాలోకి వ‌దిలింది.

ఇందులో క్యూట్ స్మైల్ తో ఆక‌ట్టుకుంటుంది. కొన్ని నెల‌లు గ్యాప్ త‌ర్వాత కాజ‌ల్ హీరోయిన్ లుక్ లో క‌నిపించ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్. కాజ‌ల్ అందాన్ని త‌నివి తీరా ఆస్వాదిస్తున్నారు. మొత్తానికి చంద‌మామ పాత పోజుతో అభిమానుల‌కు కొత్త కిక్ ని పంచింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే తమిళ్..తెలుగు..హిందీ అంటూ మూడు భాషల్ని చుట్టేస్తోంది.

కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తోంది. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తయ్యాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన `ఆచార్య` నటిస్తోంది. చిరంజీవితో కలిసి నటించడం ఇది రెండవ సారి. గతంలో `ఖైదీ నెంబర్ 150` లో మెగాస్టార్ కి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్ద హిట్ అయింది.

అదే సెంటిమెంట్ తో కొరటాల శివ మరోసారి కాజల్ ని చిరు సరసన `ఆచార్య`లో రిపీట్ చేసారు. `ఇండియన్ -2` లో విశ్వ నటుడు కమల్ హాసన సరసన నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. కాజల్ పై చిత్రీకరణకు సంబంధించి దాదాపు షూట్ పూర్తయినట్లు సమాచారం. కాజల్ గర్భం దాల్చిన తర్వాత షూటింగ్ లకు దూరమైంది. దీంతో కొత్త ప్రాజెక్ట్ లు తగ్గుముఖం పట్టాయి.