Begin typing your search above and press return to search.

ఫోటోటాక్: న‌వ నాయిక‌లకే పోటీగా జాస్మిన్ అందం

By:  Tupaki Desk   |   22 April 2022 11:30 PM GMT
ఫోటోటాక్: న‌వ నాయిక‌లకే పోటీగా జాస్మిన్ అందం
X
మ‌ల‌యాళం బ్యూటీ మీరాజాస్మిన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. `అమ్మాయి బాగుంది` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి జాస్మిన్ అటుపై `గుడంభా శంక‌ర్`..`భ‌ద్ర` లాంటి సినిమాతో ఫేమ‌స్ అయింది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాల్లో న‌టించింది. కానీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. టాలీవుడ్ లో మాత్రం బాగా ఫేమ‌స్ అయిన న‌టిగా పేరు తెచ్చుకుంది. అందం..అభిన‌యంతో తెలుగు ఆడియ‌న్స్ కు బాగా ద‌గ్గ‌రైంది. న‌టిగా మాత్రం మాతృభాష మ‌ల‌యాళంలోనే ఎక్కువ‌గా సినిమాలు చేసింది. కోలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. దాదాపు 2014 వ‌ర‌కూ యాక్టివ్ గా సినిమాలు చేసింది .

ఆ త‌ర్వాత మ‌రో నాలుగేళ్ల పాటు అడ‌పాద‌డాపా సినిమాలు చేసింది. కెరీర్ ఇక చ‌ర‌మాంకానికి చేరింద‌ని భావించి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. నాలుగేళ్ల క్రిత‌మే మీరా జాస్మిన్ అనీల్ జాన్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత ధాంప‌త్య జీవితంలోనే బిజీ అయింది. సోషల్ మాడియా యాక్టివిటీ కూడా త‌క్కువే. దీంతో పెళ్లైన ద‌గ్గ‌ర నుంచి మీరా జాస్మిన్ ఏమైపోయింది? అన్న చ‌ర్చ అప్పుడ‌ప్పుడు జ‌రుగుతుంటుంది. అయినా త‌నాకేం సంబంధం లేన‌ట్లు ఎలాంటి వివ‌ర‌ణ కూడా ఇచ్చిన సంద‌ర్భాలు లేవు.

అయితే ఇప్ప‌టివ‌ర‌కు సోష‌ల్ మీడియాకుకి దూరంగా ఉన్న మీరాజాస్మిన్ కూడా ఇన్ స్టా ఖాతా ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌చ్చింది. ఓ కొత్త ఫోటోని షేర్ చేసి పెళ్లైన అందం ఏమాత్రం త‌రిగిపోలేద‌ని నిరూపించింది. లైట్ క్రీమ్ క‌ల‌ర్ డిజైర‌ర్ దుస్తుల్లో జాస్మిన్ త‌ళుక్కున మెరిసింది. పెళ్లికి ముందుక‌న్నా అందంగా క‌నిపిస్తుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన టైమ్ లో మీరాజాస్మిన్ బొద్దు బ్యూటీగా ఫేమ‌స్ అయింది.

చాలా కాలం పాటు న‌టిగా అదే అందంతో నెట్టుకొచ్చింది. కానీ తాజా ఫోటో లో న‌వ నాయిక‌ల‌కే పోటీగా త‌యారైంది. షోల్డ‌ర్ లెస్ డిజైన‌ర్ వేర్ లో అంద‌మంతా త‌న‌కే సొంత‌మైంది! అన్నంత అందంగా క‌నిపిస్తుంది. `డ్రీమీ కైండ్ ఆఫ్ డిలైట్` అనే క్యాప్ష‌న్ కూడా పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. చాలా కాలం త‌ర్వాత మీరా జాస్మిన్ పాత అభిమానుల్ని ఇలా ప‌ల‌క‌రించ‌డంతో సంతోషిస్తున్నారు.

అలాగే మీరాజాస్మిన్ న‌టిగా మ‌ళ్లీ కంబ్యాక్ అవుతున్న‌ట్లు స‌మాచారం. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించ‌నున్న‌కొత్త సినిమాలో `మీరా జాస్మిన్` కి ఓ కీల‌క‌పాత్ర ఆఫ‌ర్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. కెరీర్ ఆరంభంలో `భ‌ద్ర` సినిమాలో అవాక‌శం ఇచ్చి బోయ‌పాటి ప్రోత్సహించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి అలాంటి బాధ్య‌త‌నే మీరా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే మ‌ల‌యాళంలో `మాక‌ల్` అనే సినిమాలోనూ అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.