Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ః ఖుషీ కపూర్‌ సిద్దం అయినట్లేనా?

By:  Tupaki Desk   |   17 Jan 2021 12:30 AM GMT
ఫొటోటాక్ః ఖుషీ కపూర్‌ సిద్దం అయినట్లేనా?
X
ఇండియన్ సినీ ప్రేమికులను సుదీర్ఘ కాలం పాటు తన సినిమాలతో ఎంటర్‌ టైన్‌ చేసి ఇప్పటికి కూడా ఆ సినిమాలతో బుల్లి తెరపై ఎంటర్‌ టైన్‌ చేస్తున్న దివంగత అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ ఇప్పటికే హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఖుషీ కపూర్‌ కూడా నటిగా పరిచయం అయ్యేందుకు సిద్దం అయ్యిందని ఈ ఫొటోతో అర్థం అవుతుంది. చాలా కాలంగా ఖుషీ కపూర్ కు సంబంధించిన ఎంట్రీ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమద్య ఒక ఇంటర్వ్యూలో ఖుషి యాక్టింగ్ లో ట్రైనింగ్‌ అవుతుంది. త్వరలోనే తను నటిగా మీ ముందుకు వస్తుందని జాన్వీ చెప్పుకొచ్చింది.

ఇటీవల ఖుషీ కపూర్‌ రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో తన న్యూ లుక్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంది. కనుక అందరు కూడా ఖుషి కపూర్‌ హీరోయిన్‌ గా పరిచయం అయ్యేందుకు ఇదే సరైన సమయం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. వరుసగా ఈ అమ్మడు సినిమాలకు కమిట్‌ అవ్వాల్సిన సమయం వచ్చిందంటూ మరి కొందరు అంటున్నారు. తాజాగా స్నేహితురాలితో కలిసి ఖుషి కపూర్‌ తీసుకున్న ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తల్లి మరియు అక్క మాదిరిగా ఖుషీ కపూర్‌ కూడా అందంగా ఉన్నారు. ఆమె ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా సినీ రంగ ప్రవేశం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.