Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో పిచెక్కిస్తోంది

By:  Tupaki Desk   |   24 Oct 2019 12:36 PM GMT
ఫొటోటాక్‌ : బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో పిచెక్కిస్తోంది
X
తెలుగు ప్రేక్షకులు ఇలియానాను అంత సులభంగా మర్చిపోలేరు. ఆమె నటించిన తెలుగు సినిమా ఏదో ఒకటి ప్రతి రోజు ఏదో ఒక ఛానెల్‌ లో వస్తూనే ఉంటుంది. ఇలియానా తెలుగు ఇండస్ట్రీ వదిలి చాలా కాలం అయినా కూడా ఆమెకు సంబంధించిన విషయాల గురించి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బాలీవుడ్‌ లో పెద్దగా అవకాశాలు లేని ఇలియానా మళ్లీ తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ఇప్పటికే అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె మరిన్ని సినిమాలు చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

సినిమాల్లో ఛాన్స్‌ లు లేని ఇలియానా ఈమద్య కాలంలో చాలా రెగ్యులర్‌ గా ఫొటో షూట్స్‌ తో పిచెక్కిస్తోంది. ఈ అమ్మడు తాజాగా తన కొత్త ఫొటో షూట్‌ ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈసారి ఇలియానా బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో కనిపించింది. కలర్‌ అయినా బ్లాక్‌ అండ్‌ వైట్‌ అయినా అమ్మడి అందం ఏమాత్రం తగ్గదని ఈ ఫొటోలు చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ ఫొటోల ద్వారా మరో విషయంపై కూడా క్లారిటీ వచ్చేసింది.

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంలో బరువు పెరిగినట్లుగా కనిపించిన ఇలియానా ఆ తర్వాత బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజా ఈ ఫొటో షూట్‌ ను చూస్తుంటే ఇలియానా గతంలో కంటే కాస్త బరువు తగ్గినట్లుగానే అనిపిస్తుంది. ముందు ముందు ఈ అమ్మడు మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.