Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : క్లీవేజ్ షో తో కేక పుట్టిస్తోంది

By:  Tupaki Desk   |   1 May 2022 10:30 AM GMT
ఫోటోటాక్ : క్లీవేజ్ షో తో కేక పుట్టిస్తోంది
X
తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి కూడా మంచి క్రేజ్ తో దూసుకు పోతున్న ముద్దుగుమ్మ నేహా శర్మ. తెలుగు లో ఈ అమ్మడికి ఇప్పటికి కూడా మంచి గుర్తింపు ఉంది. ఇలాంటి స్టార్‌ హీరోయిన్ చెల్లి ఐషా శర్మ బాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వెంటనే కరోనా వల్ల బాలీవుడ్‌ స్థంభించింది.

కరోనా వల్ల ఆఫర్లు దక్కించుకోలేక పోయిన ఐషా శర్మ మళ్లీ ఒకటి రెండు ఆఫర్లతో కెరీర్ లో ముందుకు సాగుతుంది. ఇదే సమయంలో ఈ అమ్మడి సోషల్‌ మీడియా హంగామా అంతా ఇంతా కాదు. ఈమె స్టార్‌ హీరోయిన్ రేంజ్ అందాల ఆరబోత చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉంది. ఇప్పటికే ఈ అమ్మడు తన అందాల ఆరబోత తో దాదాపుగా మూడు మిలియన్ ల ఫాలోవర్స్ ను ఇన్ స్టా లో దక్కించుకుంది.

హీరోయిన్ గా వచ్చే గుర్తింపు కంటే ఇలా అందాల విందు చేసి దక్కించుకున్న గుర్తింపు ఎక్కువ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈమె మాత్రమే కాకుండా ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్ మరియు ఫేడ్‌ అవుట్‌ హీరోయిన్స్ సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి వల్ల మంచి స్టార్‌ డమ్‌ ను దక్కించుకుంటున్నారు. కనుక ఐషా శర్మ కూడా ఇక్కడ నుండి స్టార్‌ డమ్‌ దక్కించుకుంటుంది.

తాజాగా ఐషా శర్మ షేర్‌ చేసిన హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బద్దకంగా అలా టేబుల్‌ పై వాలి... పైకి చూస్తూ నవ్వులు చిందిస్తున్న ఐషా శర్మ క్లీ వేజ్ షో తో కేక పుట్టిస్తుంది. ఏ ఒక్కరిని వదలకుండా అన్నట్లుగా యూత్‌ ఆడియన్స్ తో పాటు కాస్త సీనియర్స్ ను కూడా వావ్‌ అనిపించేలా అందంగా కనిపిస్తుంది.

క్లీ వేజ్ షో ఎబ్బెట్టుగా కాకుండా అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో నటిస్తే బాగుండు అంటూ ఫోటో కు చాలా కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ అమ్మడి అడ్రస్ పట్టుకుని మన తెలుగు సినిమాలు వెళ్తారా లేదంటే ఈమె బాలీవుడ్‌ కే పరిమితం అవుతుందా అనేది చూడాలి.