Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : రౌడీ ఫ్యాన్స్‌ కోసం దేవరకొండ ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   16 Nov 2020 7:30 AM GMT
ఫొటోటాక్‌ : రౌడీ ఫ్యాన్స్‌ కోసం దేవరకొండ ఫ్యామిలీ
X
విజయ్‌ దేవరకొండ తన ఫ్యామిలీ ఫొటోలను రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ ఉంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబంతో ముఖ్యంగా అమ్మానాన్నలతో విజయ్ దేవరకొండ ఎక్కువ సమయంను గడుపుతూ ఉంటారు. ఆయన తమ ఫ్యామిలీ ఫొటోలో వారి పెట్‌ డాగ్‌ ను కూడా చూపించారు. దీపావళి సందర్బంగా ఈ దేవరకొండ ఫ్యామిలీ కలర్‌ ఫుల్‌ గా రెడీ అయ్యి ఇలా ఫొటోకు ఫోజు ఇచ్చారు. దేవరకొండ ఫ్యామిలీ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విజయ్‌ దేవరకొండ మరియు ఆనంద్‌ దేవరకొండలను వారి తల్లిగారు ఇంకా చిన్న పిల్లలుగానే చూసుకుంటూ ఉంటారు.

ఇక ఆనంద్‌ దేవరకొండ నటించిన మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ సినిమా ఈనెలలో అమెజాన్‌ ద్వారా డైరెక్ట్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా తర్వాత ఆనంద్‌ మూడవ సినిమా విడుదల కాబోతుంది. ఇక విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో ఫైటర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా పూర్తి అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా నిలిచి పోయింది. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో విజయ్‌ దేవరకొండ మరో రెండు సినిమాలను చేస్తున్నాడు.