Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : పక్కా కమర్షియల్‌ అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   10 Jun 2022 1:30 PM GMT
ఫోటోటాక్‌ : పక్కా కమర్షియల్‌ అందాల ఆరబోత
X
2013 సంవత్సరంలో మద్రాస్ కేఫ్‌ అనే హిందీ సినిమా తో నటిగా ప్రస్థానం మొదలు పెట్టిన రాశి ఖన్నా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ లో మంచి నటిగా గుర్తింపు దక్కించుకుంది.

2014 సంవత్సరంలో ఊహలు గుసగుసలాడే సినిమా తో పేరు దక్కించుకుంది. అంతకు ముందు ఒక సినిమా చేసినా కూడా పెద్దగా ఆడలేదు. ఆ సినిమా గుర్తింపు దక్కించుకోక పోవడంతో ఊహలు గుసగుసలాడే సినిమానే రాశి ఖన్నా మొదటి సినిమా అన్నట్లుగా గుర్తింపు పొందింది.

మొదటి సినిమాలో నటిగా మంచి పేరు దక్కించుకుని ఆ తర్వాత నుండి అందాల ఆరబోత విషయమై దృష్టి పెట్టింది. కెరీర్‌ ఆరంభంలో చాలా పద్దతైన అమ్మాయి పాత్రలో కనిపించింది. అంతే కాకుండా ఈ అమ్మడు భలే బొద్దుగా ముద్దుగా ఉందే అంటూ కూడా కామెంట్స్ ను దక్కించుకుంది. మొదటి సినిమాతో పోల్చితే బరువు పెరుగుతూ వచ్చింది.

ఇలా అయితే కెరీర్‌ లో నెగ్గుకు రావడం కష్టంగా భావించిందో ఏమో కాని తక్కువ సమయంలోనే చాలా బరువు తగ్గి అందరి దృష్టిని ఆకర్షించింది.. అదే సమయంలో చాలా మందికి తన సన్నని ఫిజిక్ తో షాక్ ఇచ్చింది. సన్నబడ్డ తర్వాత తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఎప్పుడు కూడా తెగ హడావుడి చేస్తూ హంగామా చేస్తోంది.

హీరోయిన్ గా వరసగా సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు జులై 1వ తారీకున పక్కా కమర్షియల్‌ సినిమా తో రాబోతున్న విషయం తెల్సిందే. గోపీచంద్‌ హీరోగా నటించిన ఆ సినిమా కు మారుతి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా టైటిల్‌ కు తగ్గట్లుగా పక్కా కమర్షియల్‌ అన్నట్లుగా ఈ అమ్మడు అందాల విందు చేసింది.

అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా రాశిఖన్నా ఫోటో లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వావ్‌ అనిపిస్తోంది. ఈ విభిన్నమైన బ్లాక్ డ్రస్ లో క్లీ వేజ్ షో చేయడంతో పాటు కనిపించి కనిపించనట్లుగా నడుమ అందాలను కూడా చూపించి అభిమానులకు కన్నుల విందు చేసింది.