Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : చైతూ బర్త్‌ డే స్పెషల్‌ లుంగీ లుక్‌

By:  Tupaki Desk   |   23 Nov 2020 1:40 PM IST
ఫొటోటాక్‌ : చైతూ బర్త్‌ డే స్పెషల్‌ లుంగీ లుక్‌
X
అక్కినేని నాగచైతన్య తాజాగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌ స్టోరీ' చిత్రాన్ని పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయి పల్లవి హీరోయిన్‌ గా రూపొందిన ఈ సినిమా నుండి చైతూ లుక్‌ ఇప్పటికే విడుదల అయ్యింది. నేడు చైతూ బర్త్‌ డే సందర్బంగా మరో పోస్టర్‌ ను శేఖర్‌ కమ్ముల విడుదల చేశాడు. ఈ పోస్టర్‌ లో చైతూను లుంగీలో చూడవచ్చు. లుంగీ పైకి ఎగ్గట్టి సింపుల్‌ లుక్‌ లో.. పక్కింటి అబ్బాయి మాదిరిగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల చూపించాడు అనిపిస్తుంది.

పల్లెటూర్లలో ఎక్కువగా లుంగీ మరియు బనీన్‌ పై మనం కుర్రాళ్లను చూస్తూ ఉంటాం. నాగచైతన్య కూడా అచ్చు అలాగే పల్లెటూరు కుర్రాడి మాదిరిగా ఈ పోస్టర్‌ లో కనిపిస్తున్నాడు. చైతూ లుంగీ లుక్‌ కు అమ్మాయిలతో పాటు అంతా ఫిదా అవ్వడం ఖాయం అన్నట్లుగా లుక్‌ ఉంది. బర్త్‌ డే కు చైతూ అభిమానుల కోసం శేఖర్‌ కమ్ముల విడుదల చేసిన ఈ ఫొటో ఖచ్చితంగా వారి మనసులను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. చైతూ నుండి ఇలాంటి మాస్‌ నాచురల్‌ సినిమాలను అభిమానులు కోరుకుంటున్నారు. ఫిదా వంటి విభిన్నమైన సినిమాను శేఖర్‌ కమ్ముల లవ్‌ స్టోరీతో మరోసారి చూపించబోతున్నాడని పోస్టర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.