Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : రెండు దశాబ్దాలైన ఈ అందం మాత్రం తగ్గేదేలే

By:  Tupaki Desk   |   29 April 2022 12:30 AM GMT
ఫోటోటాక్ : రెండు దశాబ్దాలైన ఈ అందం మాత్రం తగ్గేదేలే
X
2003 సంవత్సరంలో బూమ్‌ సినిమాతో బాలీవుడ్‌ కు పరిచయం అయిన కత్రీనా కైఫ్‌ రెండు దశాబ్దాల సినీ కెరీర్ ను కంటిన్యూ చేస్తూనే ఉంది. ఈ రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఆమె ఎన్నో సూపర్ హిట్స్ ను దక్కించుకుంది. అదే సమయంలో అట్టర్‌ ప్లాప్స్ కూడా ఆమెకు పడ్డాయి. అయినా కూడా ఆమె ఒక నటిగా.. అందగత్తెగా దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్టలను దక్కించుకుంది.

ఇన్ స్టా గ్రామ్‌ లో ఏకంగా 67 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న కత్రీనా కైఫ్ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు తన అందంతో మైమరపించేందుకు గాను అందాల విందు చేస్తూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడు ఈ ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు దశాబ్దాల క్రితం ఈ అమ్మడు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో కంటే ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది.

అందాల విందులో నెక్ట్స్‌ లెవల్‌ మార్క్ ను దక్కించుకున్న ఈ అమ్మడు మరోసారి తన అందంతో కుర్ర కారును మైమరపిస్తోంది.

నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా అందం విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా ఈ అమ్మడు కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంది.

తనకంటే చిన్న వయసు హీరోలతో రొమాన్స్ చేసేంత అందంగా ఉన్న కత్రీనా కైఫ్‌ మరో దశాబ్ద కాలం పాటు ఇంతే అందంగా ఉండాలని.. ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈమద్యే విక్కీ కౌశల్‌ ను పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కూడా తగ్గేదే లే అన్నట్లుగా ఈ అమ్మడి జోరు కొనసాగుతోంది.