Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : అక్కను మించి బోల్డ్‌ గా ఉందే

By:  Tupaki Desk   |   1 July 2021 4:54 AM GMT
ఫొటోటాక్ : అక్కను మించి బోల్డ్‌ గా ఉందే
X
సాదారణంగా స్టార్‌ హీరోల కూతుర్లు అంటే సినిమాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించరు. ఆయా హీరోలు తమ ఆడ పిల్లలను సినిమాల్లోకి పంచించేందుకు పెద్దగా ఇష్టపడరు అనే టాక్ ఉంది. అందుకే అన్ని ఇండస్ట్రీల్లో కూడా ఎక్కువగా వారసులు కొడుకులు మాత్రమే ఉన్నారు. కొద్ది మంది మాత్రం అమ్మాయిలు వారసులుగా వచ్చారు. వారిలో సౌత్ నుండి ఉన్న వారు చాలా తక్కువ మందే ఉంటారు. కాని యూనివర్శిల్ స్టార్ కమల్‌ హాసన్ మాత్రం తన కూతుర్లు ఇద్దరికి పూర్తి స్వేచ్చ ఇచ్చాడు. ఆయన వారి ఇష్టానుసారంగానే కెరీర్ ను మల్చుకునే అవకాశం ఇచ్చాడు. ఇద్దరు కూడా సోషల్‌ మీడియాలో చాలా బోల్డ్‌ ఫొటోస్ మరియు వీడియోస్‌ ను షేర్‌ చేస్తున్నారు.

హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన సమయంలోనే శృతి హాసన్ బికినీతో రెచ్చి పోయింది. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కూడా ఆమె అందాలతో ఆకట్టుకుంది. అక్క దారిలోనే అక్షర హాసన్ కూడా హీరోయిన్ గా సక్సెస్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అక్క శృతి మాదిరిగానే అక్షర కూడా మొదట్లో నిరాశ తప్పడం లేదు. ఎట్టకేలకు మళ్లీ అక్షర బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం నెట్టింట ఆమె బోల్డ్ లుక్‌ తో పోస్టర్‌ లను మరియు స్టిల్స్ ను విడుదల చేస్తుంది. తాజాగా ఈ బ్లాక్ డ్రస్‌ లో అక్షర ను చూస్తే అక్కకు మించిన అందగత్తె అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

అక్షర హాసన్‌ బోల్డ్‌ గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అన్ని విధాలుగా ఆమె తప్పకుండా సినిమా ల్లో నటించగల సత్తా ఉందని నిరూపించుకుంటుంది. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా ఖచ్చితంగా అక్షర హాసన్ కు స్టార్‌ హీరోయిన్ గా హోదా దక్కడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. అక్షర హాసన్‌ హీరోయిన్‌ గా నే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తూ నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈమెకు దర్శకత్వం పై కూడా పట్టు ఉంది. కనుక భవిష్యత్తులో ఒక మంచి స్టార్ గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.