Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః అల్లు బుడ్డోడు జవాన్ అయ్యాడు

By:  Tupaki Desk   |   28 March 2021 10:40 AM GMT
ఫొటోటాక్‌ః అల్లు బుడ్డోడు జవాన్ అయ్యాడు
X
అల్లు అర్జున్‌ ఒక వైపు పాన్‌ ఇండియా రేంజ్‌ లో గుర్తింపు దక్కించుకుని టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోగా వెలుగు వెలుగుతుండగా మరో వైపు ఆయన కిడ్స్ అల్లు అయాన్‌ మరియు అర్హాలు సోషల్‌ మీడియాను దున్నేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయ అన్నట్లుగా ఇప్పటికే అల్లు అర్హ సోషల్ మీడియాలో ఒక సెన్షేషనే క్రియేట్‌ చేసింది. రెగ్యులర్‌ గా అర్హ నెట్టింట ట్రెండ్డింగ్ లోనే ఉంటుంది. అప్పుడప్పుడు అల్లు అయాన్‌ కూడా మీడియా ముందుకు వచ్చి సందడి చేస్తూ ఉంటాడు. ఈసారి అల్లు అయాన్‌ ఆర్మీ జవాన్‌ గా సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాడు.

అల్లు అయాన్ ఆర్మీ డ్రస్‌ లో చాలా కోపంగా శత్రువులను చీల్చి చెండాడుతున్నట్లుగా ఈ ఫొటోను నెట్టింట అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి షేర్‌ చేసింది. మై లవ్‌ అంటూ కామెంట్‌ పెట్టి స్నేహా రెడ్డి షేర్‌ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. అల్లు అయాన్‌ క్యూట్‌ నెస్ చూస్తుంటే ముందు ముందు అతడు హీరోగా గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. అల్లు అర్జున్‌ అభిమానులు మెగా అభిమానులు అయాన్‌ ను ఆర్మీ జవాన్‌ గా చూసి మురిసి పోతున్నారు. స్నేహారెడ్డి ఒక స్టూడియోను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఆ స్టూడియోలో తీసిందే ఈ ఫొటో.