Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : రెడ్‌ హాట్‌ కు ప్రత్యక్ష ఉదాహరణ.. కళ్లు తిప్పుకోగలరా?

By:  Tupaki Desk   |   6 April 2022 10:30 AM GMT
ఫోటోటాక్ : రెడ్‌ హాట్‌ కు ప్రత్యక్ష ఉదాహరణ.. కళ్లు తిప్పుకోగలరా?
X
కంచె సినిమా తో తెలుగు ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. తెలుగు లో ఈ అమ్మడికి కంచె సినిమా తో మంచి సక్సెస్ దక్కింది. ఆ సినిమా తర్వాత ఖచ్చితంగా టాలీవుడ్‌ లో ఈ అమ్మడు టాప్‌ స్టార్‌ హీరోయిన్ గా నిలుస్తుందని అంతా భావించారు. కాని ఆమె హైట్‌ మరియు ఇతర కొన్ని విషయాల కారణంగా అందంగా ఉన్నా కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు అనడంలో సందేహం లేదు.

ప్రగ్యా జైస్వాల్‌ అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక తరహా స్టార్‌ డమ్‌ ను క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ వస్తుంది అంటే కేవలం ఆమె అందం. సినిమాల్లో ఆఫర్లు వచ్చినా రాకున్నా కూడా సోషల్ మీడియాలో ఆమె తన అందాల ఆరబోత తో అభిమానులను సొంతం చేసుకుంది. తన అభిమానులను మరియు ఫాలోవర్స్ ను రెగ్యులర్‌ గా తన హాట్‌ ఫోటోలతో ఎంటర్‌ టైన్‌ చేస్తూ వస్తుంది. నెట్టింట ఈమె ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

సాదారణంగా మనం హాట్‌ గా ఉన్న వారిని రెడ్‌ తో సూచిస్తూ ఉంటాం. రెడ్‌ హాట్‌ అంటూ మనం పదే పదే వింటూ ఉంటాం. ఇక్కడ ప్రగ్యా జైస్వాల్‌ ను చూస్తుంటే రెడ్‌ హాట్‌ అనే పదం కు సరైన అర్థం.. ఉదాహరణ లభించినట్లుగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి రెడ్‌ హాట్‌ ఫోటో లు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ప్రతి ఒక్క అభిమాని కూడా వావ్‌ అంటున్నారు.

కనీసం చూపు తిప్పుకోనివ్వకుండా ఉన్న ఈ అమ్మడి అందం ముందు బాలీవుడ్‌ హీరోయిన్స్ సైతం దిగదుడుపు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పొడుగు కాళ్ల సుందరి కత్రీనా కైఫ్‌ మరియు శిల్ప శెట్టి రేంజ్ లో ఈ అమ్మడి అందం ఉందని.. వారికి ఏమాత్రం తగ్గకుండా హైట్‌ విషయంలోనే కాకుండా అందం విషయంలో కూడా పోటీగా నిలిచే సత్తా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య అఖండ సినిమాలో ఈ అమ్మడు నటించిన విషయం తెల్సిందే. బాలకృష్ణ మరియు బోయపాటి ల కాంబోలో వచ్చిన ఆ సినిమా బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ సినిమా విజయంతో ప్రగ్యా జైస్వాల్‌ మళ్లీ వరుసగా ఆఫర్లు దక్కించుకునే అవకాశం ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ విజయంతో పాటు ఈ అందాల ఆరబోత వల్ల ఖచ్చితంగా ప్రగ్యా కు వరుస ఆఫర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.