Begin typing your search above and press return to search.

ఫోటో టాక్ : 2022 హిట్టు కళ తెచ్చింది వీళ్లే..!

By:  Tupaki Desk   |   3 Dec 2022 8:30 AM GMT
ఫోటో టాక్ : 2022 హిట్టు కళ తెచ్చింది వీళ్లే..!
X
2022 సూపర్ హిట్ సినిమాలతో సౌత్ సినిమాకు కొత్త జోష్ తెచ్చిన సినీ ప్రముఖులంతా కూడా ఒకచోట చేరారు. ఒక ఎంటర్టైన్ మెంట్ వెబ్ సైట్ ఏర్పాటు చేసిన ప్రోగ్రాం లో ఈ ఏడాది సౌత్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న సినిమా మేకర్స్, నటీనటులు ఆ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. ఇక అక్కడ క్లిక్ అనిపించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరంటే.. లోకనాయకుడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్.. మళయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటుగా దర్శకులు రాజమౌళి, లోకేష్ కనగరాజ్, గౌతం మీనన్, నిర్మాత స్వప్నా దత్ లు ఉన్నారు.

ఈ ఏడాది విక్రం చేసిన సంచలనాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏడాది సూపర్ హిట్ మూవీస్ లో సెకండ్ ప్లేస్ లో విక్రం ఉంటుంది. ఇక ఇదే లిస్ట్ లో నెంబర్ 1 స్థానంలో ఆర్.ఆర్.ఆర్ ఉంటుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ నటించిన ఈ మెగా మల్టీస్టారర్ సినిమా వరల్డ్ వైడ్ సంచలనాలు సృష్టించింది. దాదాపు 1000 కోట్ల పైన భారీ వసూళ్లతో ట్రిపుల్ ఆర్ బీభత్సం సృష్టించింది. ఇటీవల వచ్చిన కాంతార కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ ఫిగర్స్ నమోదు చేసుకుంది. 16 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 400 కోట్లతో దూసుకెళ్తుంది.

ఈ ఏడాది కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కూడా 1200 కోట్ల వసూళ్లతో అదరగొట్టింది. ఈ మూవీ కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ సినిమా సత్తా చాటింది. తెలుగులో సూపర్ హిట్ అందుకున్న సీతారామం మూవీ కూడా ఈ ఏడాది క్లాసిక్ హిట్ల్ లో స్థానం సంపాదించుకుంది. ఈ ఏడాది పృధ్వి రాజ్ నటించిన బ్రో డాడీ.. జన గణ మన సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇలా 2022 లో సౌత్ లో సూపర్ హిట్ అందుకున్న మేకర్స్ అంతా కలిసి ఒకచోట చేరి సందడి చేశారు. ఈ వేడుకకు సంబందించిన స్పెషల్ వీడియో త్వరలో రిలీజ్ చేయనున్నారు.

2022 బాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో కూడా చెలరేగిపోయాయి. ఒక భాషలో తెరకెక్కిన కొన్ని సినిమాలు మౌత్ టాక్ తో పాన్ ఇండియా సినిమాలుగా అదరగొట్టి సరికొత్త సంచలనాలు సృష్టించాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.