Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : ఇంకా అందాల వల వేస్తూనే ఉంది

By:  Tupaki Desk   |   31 Oct 2021 3:30 AM GMT
ఫొటోటాక్ : ఇంకా అందాల వల వేస్తూనే ఉంది
X
'మొదటి సినిమా' అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనం బజ్వా తెలుగు లో వరుసగా సినిమాలు చేసింది. కాని అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి ఆఫర్లు ఆ తర్వాత తర్వాత రాలేదు. దాంతో టాలీవుడ్‌ నుండి కనుమరుగయ్యింది అనుకుంటున్న సమయంలో ఏదో ఒక పాట లేదా సినిమా లేదా ఏదో ఒక విషయం ద్వారా మీడియా ముందుకు వచ్చి హడావుడి చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇన్ స్టా గ్రామ్‌ ద్వారా రెగ్యులర్ గా తన ఫొటోలను షేర్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు హాట్ ఫొటో షూట్ ను షేర్‌ చేసింది.

సహజంగా అయితే హీరోయిన్స్ ఆఫర్ల కోసం ఇలాంటి హాట్‌ ఫొటో షూట్ ను షేర్‌ చేస్తారు. కాని ఈ అమ్మడు ఇప్పుడు షేర్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఈ అమ్మడు సినిమాల్లో వరుస ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఈ అమ్మడు ఇలాంటి ఫొటోలను సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా తన ఫొటో షూట్‌ లను షేర్‌ చేస్తుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మడు రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు ఈమెను మళ్లీ స్టార్‌ గా నిలుపుతాయా అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు లో ఈమె నటించిన సినిమా 'మొదటి సినిమా' సమయంలో వివాదాలు చుట్టుముట్టాయి. ఆ సినిమాలో నవదీప్‌ హీరగా నటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సినిమా ల్లో ఈమె నటించినా కూడా అవి కమర్షియల్‌ గా సక్సెస్ దక్కలేదు. అందువల్ల మెల్ల మెల్లగా ఆఫర్లు తగ్గాయి. ఇప్పుడు ఈమె తమిళం మరియు మలయాళంలో నటిస్తోంది. తెలుగు లో ఈమె చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. కాని తెలుగు నుండి ఆఫర్ల కోసం ఈమె ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటుందట. తెలుగు లో ఈమె ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమాలో గెస్ట్‌ రోల్‌ లో నటించింది. ఆ తర్వాత ఎప్పడు కూడా తెలుగులో ఈమె నటించలేదు.