Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : కళ్లు మిరిమిట్లు గొలిపే అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   18 July 2022 10:00 PM IST
ఫోటోటాక్ : కళ్లు మిరిమిట్లు గొలిపే అందాల ఆరబోత
X
అర్జున్ రెడ్డి సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ షాలిని పాండే. మొదటి సినిమాతోనే ప్రీతి గా అలరించింది. ముఖ్యంగా అర్జున్‌ రెడ్డి అదే విజయ్‌ దేవరకొండతో ముద్దు సన్నివేశాల్లో రెచ్చి పోయి మరీ నటించి ఆకట్టుకుంది. షాలిని పాండే భవిష్యత్తులో టాలీవుడ్‌ ను ఏళేయబోతుంది అంటూ అంతా బలంగా నమ్మారు. కానీ సీన్ కాస్త రివర్స్ అయ్యింది.

టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంటుందని అంతా అనుకుంటే షాలిని పాండే కి అసలు ఆఫర్లు రావడం గగనంగా మారింది. హీరోయిన్‌ గా ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు చాలా తక్కువే అయినా కూడా సోషల్‌ మీడియాలో చేస్తున్న హడావుడి కారణంగా మాత్రం మంచి పాపులారిటీని సంపాదించుకుని స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో పేరును దక్కించుకుంది.

హీరోయిన్‌ గా షాలిని పాండే తెలుగు లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు ఒక మోస్తరు గుర్తింపును దక్కించుకుని అక్కడ తన హాట్‌ ఫోటో షూట్ సాయంతో హీరోయిన్ గా ఆఫర్లు కొట్టేయాలని ప్రయత్నాలు చేస్తోంది. వరుసగా సినిమాలు చేసే సమయం కోసం వెయిట్‌ చేస్తున్నానంటూ ఈ ఫోటోలతో షాలిని చెప్పకనే చెబుతోంది.

అర్జున్‌ రెడ్డి దక్కించుకున్న విజయంతో విజయ్ దేవరకొండ స్టార్‌ అయ్యాడు.. కానీ షాలిని పాండే కు అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా సక్సెస్ లు దక్కలేదు... ఆఫర్లు కూడా అంతంత మాత్రమే.

అయినా కూడా సోషల్‌ మీడియాలో ఇలా కళ్లు మిరిమిట్లు గొలిపే విధంగా అందాల ఆరబోత చేస్తుంది. బ్లాక్ అండ్‌ వైట్‌ ఫోటోల్లో కూడా ఈ అమ్మడి అందం అదరహో అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.