Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : రియల్ రామారావు ఆన్ డ్యూటీ

By:  Tupaki Desk   |   27 July 2022 7:35 AM GMT
పిక్ టాక్‌ : రియల్ రామారావు ఆన్ డ్యూటీ
X
రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామా రావు ఆన్ డ్యూటీ సినిమా ను దర్శకుడు శరత్ మండవ అన్ని విధాలుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇటీవల రవితేజ ఒక సందర్భంగా మాట్లాడుతూ శరత్ మండవ సినిమా ప్రమోషన్ కోసం ఎవరు ఇవ్వనని ఇంటర్వ్యూ లు ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.

సినిమా ప్రమోషన్ కోసం ప్రతి ఒక్క మార్గం ను వినియోగించుకుంటూ ఉన్న దర్శకుడు సోషల్‌ మీడియా ద్వారా కూడా జనాల్లోకి రామా రావు ఆన్ డ్యూటీ సినిమా ను తీసుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఈ ఫోటోను షేర్ చేసి రామా రావు ఆన్ డ్యూటీ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేయడం జరిగింది.

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ కాళుకు గాయం కారణంగా పూర్తి విశ్రాంతి లో ఉన్న విషయం తెల్సిందే. ఆయన వెబ్‌ సిరీస్ లు చూసుకుంటూ సమయం గడపాలని భావిస్తున్నట్లుగా ఇటీవలే పేర్కొన్నాడు.

ఇంట్లో కూర్చుని కొన్ని ఫైల్స్ చూస్తున్నాను అంటూ కేటీఆర్‌ ఈ ఫోటోను ట్వీట్ చేశారు. బయటకు వెళ్లలేకున్నా ఇంట్లోనే ఉండి కల్వకుంట్ల రామారావు డ్యూటీ చేస్తున్నారు అంటూ చాలా మంది ఈ ఫోటోను తెగ షేర్‌ చేయడం జరిగింది.

కేటీఆర్ ట్వీట్ కు పక్కన రామా రావు ఆన్ డ్యూటీ అంటూ సినిమా టైటిల్ లోగో ను జత చేసి అందరి దృష్టిని ఆకర్షించే విధంగా మార్చారు. దాన్ని దర్శకుడు శరత్‌ మండవ షేర్ చేశాడు. దీంతో సినిమా గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. జనాల్లోకి సాధ్యం అయినంత ఎక్కువగా తీసుకు వెళ్లేందుకు దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం.

సినిమా ను ఎంతగా ప్రమోట్‌ చేస్తే అంతగా ఓపెనింగ్స్ వస్తున్న కాలం ఇది. అందుకే రామారావు సినిమా ప్రమోషన్స్ కోసం సాధ్యం అయినంతగా ఎక్కువగా పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా పై యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. మరి వారి నమ్మకం నిలిచేనా.. రవితేజ ఫ్యాన్స్ కు ఈ సినిమా సక్సెస్‌ ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.