Begin typing your search above and press return to search.

గ‌న్నారెడ్డి గుర్ర‌పుస్వారీ.. అర్హ సింగం స్వారీ

By:  Tupaki Desk   |   10 Jan 2023 3:46 AM GMT
గ‌న్నారెడ్డి గుర్ర‌పుస్వారీ.. అర్హ సింగం స్వారీ
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌వార‌సురాలు అల్లు అర్హ డెబ్యూ సినిమాపై భారీ అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. శాకుంత‌లం టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం లో స‌మంత ప్ర‌ధాన నాయిక‌. అల్లు అర్హ తొలిసారిగా ఈ చిత్రంతో బాల‌న‌టిగా ప‌రిచ‌యం అవుతుండ‌డంతో అభిమానుల్లో ఎగ్జ‌యిట్ మెంట్ క‌నిపిస్తోంది.

శాకుంత‌లం ట్రైలర్ ఇంత‌కుముందే విడుదలైంది. స‌మంత అప్పియ‌రెన్స్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్ కి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అలాగే అల్లు అర్హ ఈ ట్రైల‌ర్ లో షో స్టాప‌ర్ గా నిలిచింది. అర్హా సింహం పై స్వారీ చేస్తున్న ఒక గ‌ట్సీ షాట్ సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తోంది. అల్లు అర్జున్ అభిమానులు న‌ట‌వార‌సురాలి అరంగేట్రం పై ఇప్ప‌టికే ఉర‌క‌లెత్తుతున్నారు. లిటిల్ ప్రిన్సెస్ అంటూ అర్హ‌ను అభివర్ణిస్తున్నారు.

ట్రైలర్ చివర్లో క్యూట్ అర్హ మెరుపులా మెరిసింది. సింహంపై ఠీవిగా కూచుని క‌నిపించింది. ఇంత‌కీ అర్హ పాత్ర ఏమిటీ? అంటే.. ఈ సినిమాలో భ‌ర‌తుని పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని ఒక సెక్ష‌న్ లో ప్ర‌చారం సాగుతుండ‌గా.. లేదు సమంత కూతురిగా నటించింద‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. కానీ దీనికి అధికారిక స‌మాచారం వెలువ‌డాల్సి ఉంది. అభిమానులు సోషల్ మీడియాల్లో ప్ర‌స్తుతం ట్రైలర్ నుండి అర్హా లుక్ ని వైర‌ల్ చేస్తున్నారు.

ట్రైలర్‌లో అర్హా ఎంట్రీ క్లిప్ ను షేర్ చేస్తూ ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించాడు. ''వాహ్‌.. చిన్న యువరాణి అర్హా'' అని వ్యాఖ్యానించ‌గా.. ''క్యూటీ ఆధిపత్యం చెలాయిస్తోంది!'' అంటూ మ‌రొక అభిమాని వ్యాఖ్య‌ను జోడించాడు. రుద్రమదేవి నుండి అల్లు అర్జున్ గుర్రపు స్వారీ సన్నివేశాన్ని- అర్హ‌ సింహం స్వారీ సీన్ తో పోలుస్తూ మెజారిటీ అభిమానులు అర్హ డెబ్యూని స్వ‌గ‌తించారు.

జూలై 2021లో శాకుంతలం సినిమాతో అర్హా నటనా రంగ ప్రవేశంపై ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అర్హా తమ కుటుంబం నుండి నాలుగోతరం తార అని అల్లు కుటుంబం ప్ర‌క‌టించింది. గారాల కుమార్తెను ఇలాంటి అందమైన సినిమాతో ప‌రిచ‌యం చేస్తున్నందుకు గుణ‌శేఖ‌ర్ కి అల్లు అర్జున్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సమంత సినిమాలో తన కూతురు అరంగేట్రం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నాడు.

ఈ చిత్రం తెలుగు- హిందీ- తమిళం- మలయాళం- కన్నడ భాషల్లో ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అర్హ తాను న‌టించిన తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ గా ప‌రిచ‌య‌మ‌వుతుండ‌డం ఆస‌క్తిక‌రం. బ‌న్ని వార‌సురాలి ఆరంగేట్రంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.