Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : రొమాంటిక్ అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   17 Jun 2022 2:30 PM GMT
ఫోటోటాక్ : రొమాంటిక్ అందాల ఆరబోత
X
లక్ష్య మరియు రొమాంటిక్ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. పూరి ఆకాష్‌ తో రొమాంటిక్ సినిమాలో రెచ్చి పోయి నటించిన కేతిక శర్మ ఒక్కసారిగా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా కమర్షియల్‌ గా పర్వాలేదు అనిపించడంతో కేతిక శర్మకు వరుసగా ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్‌ తేజ్ తో నటిస్తున్న విషయం తెల్సిందే.

వైష్ణవ్‌ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగ రంగ వైభవంగా' సినిమా లో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి రెండు సినిమాలతో పోల్చితే ఈ సినిమా లో కేతిక శర్మ పూర్తి విభిన్నంగా కనిపిస్తుంది.

చాలా పద్దతైన ముద్దుగుమ్మ గా.. అందమైన తెలుగు అమ్మాయిగా రంగ రంగ వైభవంగా సినిమాలో ఈ అమ్మడు కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ ను బట్టి తెలుస్తోంది.

రంగ రంగ వైభవంగా సినిమా లో అంత పద్దతిగా నటించినా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఈ అమ్మడి అసలు స్వరూపం ను బయట పెడుతూ ఉంటుంది. తాజాగా ఈ ఫోటోను షేర్‌ చేసిన కేతిక శర్మ మరోసారి అభిమానుల గుండెల్లో గుబులు రేపింది. ఈ రొమాంటిక్ అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. సినిమాలో కంటే ఈ అమ్మడు ఇన్‌ స్టా లోనే ఎక్కువ కనిపిస్తుంది.

పెద్ద హీరోయిన్స్ నుండి చిన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈమధ్య కాలంలో అందాల ఆరబోత విషయంలో పోటీ పడుతున్నారు. కేతిక శర్మ ఏకంగా స్టార్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటూ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత విషయంలో కేతిక శర్మ టాప్ లో ఉందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రంగ రంగ వైభవంగా సినిమా కమర్షియల్‌ గా సక్సెస్ అయితే ఈ అమ్మడు ఖచ్చితంగా ఓ రేంజ్ లో దూసుకు పోవడం కన్ఫర్మ్‌ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని.. రెండు మూడు నెలల్లో ఆ సినిమాల్లో ఒకటి లేదా రెండు పట్టాలు ఎక్కే అవకాశం ఉందట. అందులో ఒక యంగ్‌ స్టార్‌ హీరో సినిమా కూడా ఉందట. ఆ సినిమా ఏంటీ అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.