Begin typing your search above and press return to search.

వీడియో : నాచురల్‌ బ్యూటీ ఇలా తయారయ్యిందేంటీ?

By:  Tupaki Desk   |   3 Jun 2022 12:43 PM GMT
వీడియో : నాచురల్‌ బ్యూటీ ఇలా తయారయ్యిందేంటీ?
X
1980 మరియు 90 కిడ్స్‌ కు అందం అంటే ఐశ్వర్య రాయ్‌.. హీరోయిన్‌ అంటే ఐశ్వర్య రాయ్‌.. డ్రీమ్‌ గర్ల్‌ అంటే ఐశ్వర్య రాయ్‌. అంతటి అభిమానం ను దక్కించుకున్న ఐశ్వర్య రాయ్ ఇప్పటికి కూడా ఎంతో మంది అభిమానంను సొంతం చేసుకుని స్టార్‌ గా కొనసాగుతూనే ఉంది. ఈమద్య కాలంలో సినిమాల్లో ఎక్కువ నటించక పోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె లుక్ పరంగా కూడా ఈ మద్య తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

ఐశ్వర్య రాయ్ ది నాచురల్‌ బ్యూటీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1990 ల్లో ఆమె చేసిన సినిమాల్లో ఎంత నాచురల్‌ గా కనిపించేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐశ్వర్య రాయ్ మేకప్ తో కంటే మేకప్‌ లేకుండా అందంగా ఉంటారు అంటూ చాలా మంది అంటూ ఉంటారు. అలాంటి ఐశ్వర్య రాయ్ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి మీడియా కు ఫోజులు ఇచ్చింది.

ఆ సమయంలో ఆమె ధరించిన కాస్ట్యూమ్స్‌ మరియు ఆమె వేసుకున్న మేకప్‌ విమర్శల పాలయ్యింది. ఏదో టెంట్‌ వేసినట్లుగా డ్రస్ వేసుకున్న ఐశ్వర్య మొహానికి సున్నం పూసినట్లుగా అరచేతి మందం మేకప్‌ ను దట్టించినట్లుగా విమర్శలు వస్తున్నాయి.

పైగా ఐశ్వర్య రాయ్‌ వయసు మీద పడి ముసలి చాయలు కనిపించకుండా మేకప్‌ చేసినట్లుగా ఉన్నాయంటూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఐశ్వర్య రాయ్ నుండి ఇలాంటి ఫోటోలు వీడియోలను ఎక్స్‌ పెక్ట్‌ చేయలేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈమద్య కాలంలో ఐశ్వర్య రాయ్ గురించి ఇదే విషయమై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. అయినా కూడా ఈమె ఎందుకు పట్టించుకోవడం లేదు.. అయినా కూడా ఎందుకు ఈమె తన పద్ధతి మార్చుకోవడం లేదు అంటున్నారు.

ఇప్పటికి కూడా లక్షల్లో అభిమానులను కలిగి ఉన్న ఐశ్వర్య రాయ్ ఎందుకు బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేయడం లేదని కూడా అభిమానులు అసహనంతో ఉన్నారు. వయసుకు తగ్గ పాత్రల్లో నటించినా కూడా ఆమె కోసం సినిమాలు చూసే వారు చాలా మంది ఉన్నారు. కనుక ఆమె వరుసగా సినిమాలు చేయాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.