Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : అందాల విందుతో ఉక్కిరి బిక్కిరి

By:  Tupaki Desk   |   4 May 2022 2:30 AM GMT
ఫోటోటాక్ : అందాల విందుతో ఉక్కిరి బిక్కిరి
X
బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ వాణీ కపూర్‌ ఈమద్య కాలంలో సినిమాలో ఎక్కువ కనిపించకున్నా కూడా సోషల్‌ మీడియాలో సాధ్యం అయినంత ఎక్కువగా సందడి చేస్తోంది. తెలుగు లో ఈమె ఆహా కళ్యాణం అనే సినిమాలో నటించిన విషయం తెల్సిందే. నాని హీరోగా నటించిన ఆ సినిమా అట్టర్‌ ప్లాప్ అయ్యింది. దాంతో మళ్లీ తెలుగు లో ఈమె నటించేందుకు ఆసక్తి చూపించలేదు.. టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ కూడా ఈమెపై ఆసక్తి కనబర్చలేదు.

బాలీవుడ్‌ లో మెల్ల మెల్లగా పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఈమె నటించిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. కాని ఈమె మోడల్‌ గా ఫోటో షూట్స్ తో స్టార్‌ హీరోయిన్ గా వంద సినిమాల్లో నటించినంత గుర్తింపును దక్కించుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రెగ్యులర్‌ గా ఇన్ స్టా గ్రామ్‌ లో హాట్‌ ఫోటోలను షేర్‌ చేసి తన అందాల విందును చేసే ఈ అమ్మడు తాజాగా మరోసారి ఇలా క్లీ వేజ్ షో తో కవ్విస్తూ ఉంది. అందాలను విందుగా పరచిన ఈ అమ్మడు కుర్ర కారును ఉక్కిరి బిక్కిరి చేస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మోడలింగ్‌ పై ఎక్కువ శ్రద్ద పెట్టి సినిమాలను ఈమె పక్కన పెట్టి ఉంటుందని.. అందుకే ఇంత అందంగా ఉన్న బాలీవుడ్‌ లో గుర్తింపు రాలేదు అంటూ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

వాణీ కపూర్‌ హీరోయిన్ గా ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు రూపొందుతున్నాయి. అందులో ఒకటి రణబీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న సినిమా అవ్వడం విశేషం. ఈమె హీరోయిన్ గా సినిమాలు ఎంత వరకు చేస్తుందో కాని రెగ్యులర్‌ గా హాట్‌ ఫోటో లతో ఇన్ స్టా లో తన స్థాయిని అంతకంతకు పెంచుకుంటూ పోతుంది.

ఇప్పటికే ఈమెకు ఇన్‌ స్టా లో 5.5 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇదే స్థాయిలో హాట్‌ ఫోటోలతో అభిమానులను మరియు నెటిజన్స్‌ ను అలరిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తే ఈ ఏడాది చివరి వరకు పది మిలియన్‌ ల ఫాలోవర్స్ వచ్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.