Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : ప్రియుడితో నయన్‌ రిలీజ్‌ స్పెషల్‌

By:  Tupaki Desk   |   29 April 2022 2:30 AM GMT
ఫోటోటాక్ : ప్రియుడితో నయన్‌ రిలీజ్‌ స్పెషల్‌
X
సౌత్‌ స్టార్‌ హీరోయిన్ నయనతార చాలా కాలంగా విఘ్నేష్‌ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారంటూ కొందరు.. లేద త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మరి కొందరు ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. అసలు విషయం ఏంటో కాని ఇద్దరు మాత్రం తమ ప్రస్తుత లైఫ్ ను చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.

ఈమద్య కాలంలో రెగ్యులర్ గా దైవ దర్శణాలు చేస్తున్న వీరిద్దరు తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య భర్తల మాదిరిగానే అత్యంత క్లోజ్ గా వీరిద్దరు అక్కడ కనిపించారు. ముఖ్యంగా నయనతార నుదుట బొట్టు కూడా పెట్టుకుని ఉండటం వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. గతంలో క్రిస్టియన్ గా ఉన్న నయన్‌ ఈమద్య కాలంలో హిందూ దేవుళ్ల వద్దకు తెగ వెళ్తుంది.

నేడు విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో నయనతార నటించి స్వయంగా నిర్మించిన కాతువాకుల రెండు కాదల్‌ సినిమా విడుదల అయ్యింది. గత ఏడాది కాలంగా ఈ సినిమా అదుగో ఇదుగో అంటూ దర్శకుడు విఘ్నేష్‌ శివన్ ఊరిస్తూ వస్తున్నాడు. నయన్‌ మాత్రమే కాకుండా ఈ సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ సమంత మరియు స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలను సినిమా అందుకుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సినిమా సూపర్‌ హిట్‌ అవ్వాలంటూ కోరుకుంటూ నయనతార ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీరిద్దరు కలిసి నిన్న రాత్రి తిరుమల చేరుకుని తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ వారు పూజాలు నిర్వహించినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న విషయాన్ని స్వయంగా విఘ్నేష్‌ శివన్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేయడంతో పాటు ఈ ఫోటోను షేర్‌ చేశాడు. ఆకట్టుకునే వీరి జంట ఎప్పుడు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటుంది.

నయన తార వంటి స్టార్‌ హీరోయిన్ ను.. లేడీ సూపర్ స్టార్‌ ను దక్కించుకుంటున్న భాగ్యవంతుడు.. అదృష్టవంతుడు విఘ్నేష్‌ శివన్‌ అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.