Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : క్రాస్ హాల్ట‌ర్ నెక్ లో కియారా క‌వ్విస్తోందిగా

By:  Tupaki Desk   |   29 April 2022 12:30 PM GMT
ఫోటోటాక్ : క్రాస్ హాల్ట‌ర్ నెక్ లో కియారా క‌వ్విస్తోందిగా
X
బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాణీ కిల్లర్ లుక్స్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఇటీవలి వరుస ఫోటోషూట్లు అందుకు నిదర్శనం. వ‌రుస‌గా ఇన్ స్టాని త‌న‌దైన గ్లామ్ షోతో త‌రుచూ హీటెక్కిస్తూనే ఉంది. టెంప్టింగ్ ఫోటోల‌తో యువ‌త గుండెల్లో మంట‌లు రేపుతూనే ఉంది. తాజాగా అమ్మ‌డు మరోసారి త‌న‌దైన మార్క్ ఫోజులో నెట్టింట దుమారం రేపుతుంది.

ఫోటోలో అమ్మ‌డి డిజైన‌ర్ డ్రెస్ స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంది. హై-వెయిస్ట్ బ్లూ డెనిమ్ జీన్స్ తో అంద‌మైన ట్రెండీ క్రిస్ క్రాస్ హాల్ట‌ర్ నెక్ డాటెడ్ క్రాప్ ధ‌రించింది. చెవుల‌కు బంగారు చెవిపోగులు ధ‌రించి అమ్మ‌డిని మ‌రింత ఆక‌ర్ష‌ణీయ‌మైన లుక్ లో ఎలివేట్ చేస్తున్నాయి. ముఖానికి మేక‌ప్...పెద‌వుల‌కు ప‌ల‌చ‌గా లిప్ స్టిక్...టోన్డ్ బాడీ లుక్ లో వీపు అందంలో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది.

ఇక కియారా చూపుల బాణం ఎవ‌రి గుండెల్లోనైనా ఇట్టే దిగిపోతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఫోటోని అలియాభ‌ట్..అన‌న్య పాండే..విక్కీ కౌశ‌ల్ స‌హా ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు లైక్ చేసారు. ఆ లైక్ లు కియారా లుక్ ని మ‌రింత ప్ర‌త్యేకంగా మార్చాయి.

కియారా సినిమాల విష‌యానికి వ‌స్తే కియరా నటించిన 'భూల్ బులయా 2' విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో యంగ్ ట్యాలెంటెడ్ కార్తీక్ ఆర్యన్ సరసన కియరా అద్వాణీ నటించింది. ఇంతకుముందు విడుదలైన ట్రైలర్ వెబ్ లో వైరల్ గా మారింది.

ఈ చిత్రంలో కియరా ఝడిపించేసే భయానకమైన ఘోస్ట్ గా కనిపించనుంది. తనకు నటించేందుకు ఒక రేంజులో స్కోప్ కల్పించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అనీష్ బజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆర్ సీ 15లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ సరసన నటించడం రెండవసారి. గతంలో 'వినయ విధేయ రామ'లో నటించింది. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోలేదు. కానీ ఆ సినిమా ఫ‌లితంతో సంబంధం లేకుండా శంకర్ కియారాని మళ్లీ ఎంపిక చేసారు.