Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : కుర్చీలో కళావ‌తి ఆరామ్ సే?

By:  Tupaki Desk   |   28 April 2022 11:30 PM GMT
ఫోటోటాక్ : కుర్చీలో కళావ‌తి ఆరామ్ సే?
X
మ‌ల‌యాళం బ్యూటీ కీర్తి సురేష్ ఫోటో సెష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. గ్లామ‌ర్ డోస్ లో ఆమెకి కొన్ని ప‌రిమితులున్నాయి. బికినీ..టూపీస్..పొట్టి నిక్క‌ర్లు..టోన్డ్ బాడీలుక్ లో క‌నిపించ‌డం అంటే అమ్మ‌డికి గిట్ట‌దు. కొన్ని క‌ట్టుబాట్ల‌తో సినిమా రంగంలో కొన‌సాగుతుంది. ఆ కార‌ణంగా కొంత వెనుక‌బాటు త‌నం ఉన్న‌ప్ప‌టికీ స‌డ‌లింపులు మాత్రం ఉండ‌వ‌న్న‌ది ఇప్ప‌టికే తేలిపోయింది.

అప్పుడ‌ప్పుడు ఇన్ స్టాలో అభిమానుల‌కు ప‌ద్ద‌తైన దుస్తుల్లోనే ట‌చ్ లోకి వ‌స్తుంది. అదీ చాలా రేర్ గా జ‌రుగుతుంది. తాజాగా అమ్మ‌డు కొత్త ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

డిజైన‌ర్ ప్యాంట్..ష‌ర్టు ధ‌రించి ఓ ఓల్డ్ కుర్చీలో రిలాక్స్ అవుతోన్న ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. కుర్చీలో అమ్మ‌డు ఆరేంసే క‌ళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకుంటుంది.

కుర్చీ స‌పోర్టింగ్ హ్యాండ్ పై కాలు చాపి..మ‌రో కాలిని ద‌గ్గ‌ర‌కి మ‌డిచి..త‌ల‌పై చేయి వేసుకుని క‌ల‌ల్లోకి జారుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెటి జ‌నుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఫోజు సూప‌ర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ సినిమాల విష‌యానికి వ‌స్తే సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న 'స‌ర్కారు వారి పాట‌'లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే క‌ళావ‌తి పాట‌తో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది.

ఈ సినిమాపై కీర్తి చాలా ఆశ‌లే పెట్టుకుంది. స‌రైన క‌మ‌ర్శియ‌ల్ స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతుంది. 'మ‌హాన‌టి' త‌ర్వాత రిలీజ్ అ యిన సినిమాల‌న్ని ఆశించిన ఫ‌లితాన్ని సాధించ‌లేదు. దీంతో కీర్తి డిమాండ్ కాస్త త‌గ్గింద‌నే విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌ళావ‌తిగా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవాల‌ని వెయిట్ చేస్తోంది.

అలాగే నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న 'ద‌స‌రా'లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 'భోళా శంక‌ర్' లోనూ ఛాన్స్ అందుకుంది.