Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : క్యూట్‌ లవ్‌ స్టోరీ కపుల్‌

By:  Tupaki Desk   |   10 March 2020 12:30 PM GMT
ఫొటోటాక్‌ : క్యూట్‌ లవ్‌ స్టోరీ కపుల్‌
X
నాగచైతన్య.. సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ‘లవ్‌ స్టోరీ’ చిత్రంలోని ఓయ్‌ పిల్లా పాటను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. నేడు హోళీ సందర్బంగా ఓ పోస్టర్‌ తో చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాగచైతన్య కళ్లు మూసుకుని ఉండగా సాయి పల్లవి చాలా ప్రేమగా అతడి వైపు చూస్తూ ఉంది.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వం లో గతంలో వచ్చిన చిత్రాల మాదిరిగా ఈ చిత్రం కూడా ఒక క్యూట్‌ లవ్‌ స్టోరీ తో తెరకెక్కుతుంది. హీరో హీరోయిన్స్‌ పాత్రలు మన పక్కన ఉన్న వాళ్ల మాదిరిగా మన చుట్టు ఉన్న వాళ్ల మాదిరిగా అనిపిస్తాయి. ఇప్పుడు లవ్‌ స్టోరీ సినిమా లో కూడా నాగచైతన్య మరియు సాయి పల్లవిల పాత్రలు చాలా సింపుల్‌ గా ఉండబోతున్నాయని ఈ స్టిల్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

ఫిదా చిత్రం తర్వాత సాయి పల్లవి మరోసారి ఈ చిత్రం తో ఖచ్చితంగా ఫిదా చేయబోతుందని ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌ వీడియోలు మరియు స్టిల్స్‌ తో అర్థం అవుతుంది. తెలంగాణ యాసతో నాగచైతన్య మొదటి సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయ్యాడు. గత ఏడాది నాగచైతన్యకు బాగా కలిసి వచ్చింది. ఈ ఏడాది ఈ సినిమాతో హిట్‌ కొడతాడా చూడాలి. మే లో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.