Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : నాని హీరోయిన్‌ అందాల అరాచకం

By:  Tupaki Desk   |   2 Sep 2022 5:30 PM GMT
ఫోటోటాక్ : నాని హీరోయిన్‌ అందాల అరాచకం
X
తెలుగు లో మళ్లీ రావా అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్‌. ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగు లో నాగార్జునకు జోడీగా దేవదాసు సినిమాలో కూడా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో నాని కూడా ఒక హీరోగా నటించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ అమ్మడికి ఆఫర్లు తెలుగు లో పెద్దగా రాలేదు.

దాంతో పూర్తిగా బాలీవుడ్ కు ఈ అమ్మడు పరిమితం అవ్వాలని భావించింది. కానీ అనూహ్యంగా మళ్లీ తెలుగు లో ఈమెను నాని 'మీట్‌ క్యూట్‌' అనే సినిమా తో రీ ఎంట్రీ ఇప్పిస్తున్నాడు.

ఆయన మరియు ఆయన సోదరి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టా లో షేర్‌ చేసిన ఈ ఫోటోలు ఎక్కువ శాతం మంది నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫిజిక్‌ కాస్త తక్కువ ఉన్నా కూడా ఈ అమ్మడి అందాల ఆరబోత కు అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు అనడంలో సందేహం లేదు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్‌ ఉంది.

ఇప్పటి వరకు సినిమాలతో కమర్షియల్‌ గా మంచి గుర్తింపును దక్కించుకోలేక పోయినా కూడా దాదాపుగా ఈమెకి ఇన్‌ స్టా లో మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

రెగ్యులర్ గా ఇలాంటి ఫోటో షూట్స్ ను ఈ అమ్మడు షేర్‌ చేస్తే తప్పకుండా అతి త్వరలోనే ఈ అమ్మడు మరో మిలియన్‌ మెంబర్స్ ని తన ఖాతాలో వేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.