Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు

By:  Tupaki Desk   |   15 Nov 2019 8:56 AM GMT
ఫోటో స్టోరి: ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు
X
ఎటో వెళ్లిపోయింది మనసు ఇలా ఒంటర‌య్యింది వయసు! ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో! `నిన్నే పెళ్లాడుతా` చిత్రంలోనిది ఈ క్లాసిక్ గీతం. ఆ సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టే ఇక్క‌డ ఆప్టే గాళ్ ఎక్స్ ప్రెష‌న్ చూశారా? .. సంచ‌ల‌నాల‌ రాధికా ఆప్టే ఏదో నిర్వాదంలో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇలా సుదీర్ఘాలోచ‌న‌ లోనే ప‌డి పోయింది ఎందుక‌నో!

అయితే ఇదంతా లేటెస్ట్ ఫోటోషూట్ కోస‌మే. ఓవైపు వెబ్ సిరీస్ లు.. మ‌రోవైపు ఆఫ్ బీట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాల‌తో రాధిక ఆప్టే వేడెక్కిస్తోంది. ఎక్స్ పోజింగ్ కి వెర‌వ‌ని అందాల క‌థానాయిక‌ గా ఇప్ప‌టికే యూత్ లో గొప్ప ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ ల‌స్ట్ బ్యూటీ. ఆప్టే న‌టించిన ల‌స్ట్ స్టోరీస్ ని .. ది వెడ్డింగ్ గెస్ట్ (ఇంగ్లీష్‌) ని ఇంకా యూత్ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు మ‌రి! ఆ త‌ర్వాతా సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం రాధిక‌ కు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ హీటెక్కిస్తూనే ఉంటుంది. ఇక వివాదాల‌తోనూ ఈ అమ్మ‌డు నిరంత‌రం అగ్గి రాజేస్తూనే ఉంది.

తాజా ఫోటోషూట్ లో మేక‌ప్ లెస్ గా ఎంతో సింపుల్ గా క‌నిపించింది. అంత‌కుమించి సింపుల్ పింక్ ఫ్రాకులో అందాల ఎలివేష‌న్ కొట్టొచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. రాధిక నెవ్వ‌ర్ బిఫోర్ లుక్ ఇది అంటే అతిశ‌యోక్తి కాదు. ఏదో ఆలోచిస్తూ అంత అందంగా ఫోటోల‌కు ఫోజులివ్వొచ్చా! కాన్సెప్టు బావుంది అంటూ పొగిడేస్తున్నారు యూత్.