Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: యామి ఓ యమ్మీ ట్రీట్

By:  Tupaki Desk   |   11 March 2020 7:46 AM
ఫోటో స్టోరీ: యామి ఓ యమ్మీ ట్రీట్
X
యామి గౌతమ్ పేరు అందరికీ కాకపోయినా కొందరు తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే 'నువ్విలా'.. 'గౌరవం'.. 'కొరియర్ బాయ్ కళ్యాణ్' లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లో పెద్దగా బ్రేక్ దక్కలేదు. దీంతో ఎక్కువగా బాలీవుడ్ పైనే దృష్టి సారించింది. ఈమధ్య 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్'.. 'బాలా' లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఇక అందరు హాట్ భామల తరహాలోనే సోషల్ మీడియాను షేక్ చెయ్యడం ఈ యామికి చాలా సాధారణమైన విషయం.

ఏదో ఒక హాట్ ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్ల హృదయాలను గట్టిగా మీటి వారికి నిద్రను దూరం చేసే ప్రయత్నాలలో ఉంటంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ఒక గోధుమ రంగు లవ్ ఏమోజిని క్యాప్షన్ గా ఇచ్చింది. ఫోటోలో బ్రౌన్ కలర్ డ్రెస్ ధరించి ఇంట్లో కూర్చున్నట్టుగా ఓ వెరైటీ పోజులో కూర్చుంది. జంబో వీనెక్ కారణంగా భారీ స్థాయిలో అందాల విందు జరిగింది. యామి ఎక్స్ ప్రెషన్ కూడా మహా సెక్సీగా ఉంది.

ఈ ఫోటోకు బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ ఒక లైక్ వేసుకున్నాడు. ఇక సాధారణ నెటిజన్ల సంగతి చెప్పేదేముంది.. ఎవరికి తోచిన కామెంట్లు పెట్టారు. "యామి.. ఇది యమ్మి ట్రీట్".. "యామి ఆన్ ఫైర్" అంటూ స్పందించారు. ఇక యామి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'జిన్నీ వెడ్స్ సన్నీ' అనే రొమాంటిక్ కామెడీ లో నటిస్తోంది. ఈ సినిమాలో హీరో విక్రాంత్.