Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: త‌డిపొడి అందాల త‌మ‌కం

By:  Tupaki Desk   |   25 Oct 2019 6:21 AM GMT
ఫోటో స్టోరి: త‌డిపొడి అందాల త‌మ‌కం
X
పూజా హెగ్డే టాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ప‌రిశ్ర‌మ‌లో అంద‌రు అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించేస్తోంది. అల్లు అర్జున్- ఎన్టీఆర్-మ‌హేష్‌- ప్ర‌భాస్ .. ఇలా స్టార్లంతా రిపీటెడ్ గా పూజా కోసం వెయిటింగ్. అల్లు అర్జున్ ఇప్ప‌టికే రెండోసారి ఛాన్సిచ్చాడు. 'అల వైకుంట‌పుర‌ములో' ప్ర‌స్తుతం సెట్స్ పై ఉంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న జాన్ చిత్రంలోనూ పూజా హెగ్డే న‌టిస్తోంది. ఈలోగానే అక్ష‌య్ -రానా- బాబి డియోల్ లాంటి స్టార్ల‌తో క‌లిసి 'హౌస్ ఫుల్ 4' లాంటి భారీ చిత్రంలో న‌టించింది. ఈ సినిమా నేడు రిలీజైంది.

నిన్న‌టివ‌ర‌కూ 'హౌస్ ఫుల్ 4' రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో బిజీబీజీగా ఉన్న పూజా సామాజిక మాధ్య‌మాల్లోనూ పోస్ట‌ర్ల‌తో ప్ర‌చారం చేసింది. తాజాగా ఓ స్పెష‌ల్ పిక్ ని ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది. అయితే ఇది పూర్తిగా డిఫ‌రెంట్. వైట్ అండ్ వెట్ లుక్ లో ఉన్న ఈ స్టిల్ యూత్ గుండెల్లో గుబులు రేపుతోంది.

బోల్డ్ గా క‌నిపించ‌డం పూజాకి కొత్తేమీ కాదు కానీ.. కాంపిటీష‌న్ లో నెగ్గుకొచ్చేందుకు ఇదిగో ఇలా ఘాటుగానే వ‌య్యారాల వ‌డ్డ‌న చేస్తోంది. వెట్ హెయిర్.. వెట్ బాడీని ఎలివేట్ చేస్తోంది ఈ ఫోటో. వైట్ నైలాన్ డ్రెస్ లో కిలాడీ చూపుల‌తో గాలం వేస్తోంది. మొత్తానికి పిక్చ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ .. హౌస్ ఫుల్ 4 స‌మీక్ష‌లు మ‌రి కాసేప‌ట్లో రానున్నాయి. అందులో పూజా ప్ర‌తాప‌మెంతో క్రిటిక్స్ ఏమంటున్నారో చూడాలి.