Begin typing your search above and press return to search.

#ఊర్వ‌శి.. ఆద‌మ‌రిచి ఆ నిదురేల ఓ బార్బీ బొమ్మా?

By:  Tupaki Desk   |   19 March 2021 12:30 PM GMT
#ఊర్వ‌శి.. ఆద‌మ‌రిచి ఆ నిదురేల ఓ బార్బీ బొమ్మా?
X
ఆద‌మ‌రిచి అలా నిదుర‌పోతోంది ఎవ‌రీ కుంద‌న‌పు బొమ్మ‌.. ఇంకెవ‌రు? హేట్ స్టోరి 4 బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా. చూస్తుంటే బార్బీ బొమ్మ‌నే త‌ల‌పిస్తోంది. మిల్కీ అందాల‌తో మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నానే రీప్లేస్ చేసేట్టుంది.

అన్న‌ట్టు ఈ బార్బీ అందం తొంద‌ర్లోనే తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనూ అడుగుపెడుతోంది. ఇక్క‌డ మిల్కీ బ్యూటీతో వ‌రుస సినిమాలు చేస్తున్న‌ సంప‌త్ నంది తెర‌కెక్కిస్తున్న తెలుగు-హిందీ ద్విభాషా సినిమాలో అవ‌కాశం అందుకుంది.

ఇక టాలీవుడ్ ని క్లీన స్వీప్ చేయాల‌న్న పంతంతోనే ఉందిట ఊర్వ‌శి. త‌దుప‌రి ప‌లువురు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లు.. స్టార్ హీరోలు ఈ అమ్మ‌డికి అవ‌కాశాలిచ్చేందుకు రెడీ అవుతున్నార‌ని ఇటీవ‌ల గుస‌గుస‌లు వినిపించాయి. ఇక ఇదే ఊపులో ఊర్వ‌శి ఇలా సోష‌ల్ మీడియాల్లో చెల‌రేగుతోంది. తాజాగా ఊర్వ‌శి ఇన్ స్టా మాధ్య‌మంగా షేర్ చేసిన ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ఫ్యాన్స్ లో వైర‌ల్ గా మారింది. అలా కుర్చీ అంచుకు జారిపోయి అంత‌గా ఆద‌మ‌రిచి నిదురిస్తే ఎలా ఓ బుట్ట బొమ్మా.. బార్బీ బొమ్మా! అంటూ ఫ్యాన్స్ ఊర్వ‌శిని ప‌దే ప‌దే క‌ల‌వ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెటిజనుల్లో వైర‌ల్ గా మారుతోంది.