Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: శ్రీ‌వ‌ల్లీ పూల్ సైడ్ రిలాక్స్ మోడ్

By:  Tupaki Desk   |   2 Jan 2022 1:30 AM GMT
ఫోటో స్టోరి: శ్రీ‌వ‌ల్లీ పూల్ సైడ్ రిలాక్స్ మోడ్
X
రీ‌వ‌ల్లిగా యువ‌త‌రం గుండెల్లో నిలిచిపోయింది ర‌ష్మిక మంద‌న. వ‌రుస సినిమాలతో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ ఛ‌లో చిత్రంలో అల్ల‌రి అమ్మాయిగా క‌నిపించింది. ఆ త‌ర్వాత గీత గోవిందంలో గీత అనే గ‌డుస‌రి అల్ల‌రి పిల్ల‌గా మ‌తులు చెడ‌గొట్టింది. ఆ రెండు సినిమాలు రికార్డ్ బ్రేకింగ్ హిట్స్ గా నిలిచాయి.

మ‌హేష్ స‌ర‌స‌న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయం చేసుకుని ఆ త‌ర్వాత పుష్ప చిత్రంతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌న ఖాతాలో వేసుకుంది. ర‌ష్మిక మంద‌న అంటే గోల్డెన్ హ్యాండ్ అన్నంత పాపులారిటీ ఉంది. త‌ను ఎక్క‌డ ఉంటే అక్క‌డ స‌క్సెస్ త‌ప్ప ఫెయిల్యూర్ అన్న‌దే లేదు. ఇక‌పైనా అటు బాలీవుడ్ లో వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న మ‌ల్హోత్రాకి కూడా ర‌ష్మిక ఛ‌రిష్మా క‌లిసి రానుందని భావిస్తున్నారు. అక్క‌డ `మిష‌న్ మంజు`లో ర‌ష్మిక క‌థానాయికగా న‌టిస్తోంది. సైమ‌ట్టేనియ‌స్ గా బిగ్ బితో క‌లిసి గుడ్ బాయ్ అనే మ‌రో చిత్రం చేస్తోంది.

ఇక పుష్ప‌లో శ్రీ‌వ‌ల్లి అనే గ్రామీణ యువ‌తి పాత్ర‌తో అటు హిందీ ఆడియెన్ కి పిచ్చిగా క‌నెక్ట‌యిపోయిన ర‌ష్మిక నేష‌న‌ల్ క్ర‌ష్ గా గుండెల్లో నిలిచిపోయింది. మునుముందు ఇదే స్పీడ్ లో వ‌రుస‌గా భారీ క్రేజీ చిత్రాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. న్యూఇయ‌ర్ వేళ ఇదిగో ఇలా పూల్ సైడ్ రిలాక్స్ డ్ గా క‌నిపించింది. ఈ నూత‌న సంవ‌త్స‌రాన్ని కుటుంబ స‌భ్యుల‌తో ఛీర‌ప్ చేసింది ర‌ష్మిక‌.