Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మేలో అడుగు పెట్ట‌క ముందే అగ్గి రాజేస్తోంది!

By:  Tupaki Desk   |   7 April 2021 2:30 AM GMT
ఫోటో స్టోరి: మేలో అడుగు పెట్ట‌క ముందే అగ్గి రాజేస్తోంది!
X
అందానికి అందం ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్సెస్ న‌భా న‌టేష్ ప్ర‌త్యేక‌త‌. ఈ భామ క‌న్న‌డ రంగం నుంచి టాలీవుడ్ లో అడుగు పెట్టి ఇక్క‌డ వ‌రుస‌గా క్రేజీ అవ‌కాశాలు అందుకుంటోంది. ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాక న‌భాకి ఎదురే లేకుండా పోయింది.

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లోనూ ఈ భామ చాలా స్పీడ్ గా ఉంది. తాజాగా రెడ్ అనే లైఫ్ స్టైల్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై న‌భా త‌ళుకుబెళుకులు హాట్ టాపిక్ గా మారాయి. రెడ్ బ్యాక్ గ్రౌండ్ అందులో మిక్స్ అయ్యే రెడ్ దుస్తుల్లో న‌భా ఇచ్చిన ఫోజు వాతావ‌ర‌ణాన్ని వేడెక్కించింది. రెడ్ క‌లర్ మోడ్ర‌న్ దుస్తులను ధరించి ఒక ఫోటోలో క‌నిపించ‌గా.. మరొక చిత్రంలో, ఆమె అవే దుస్తుల్లో షేడ్ తో క‌నిపించింది. ఈ వేసవిలో హాటెస్ట్ ఫోటోషూట్ ఇద‌ని చెప్పొచ్చు.

న‌భా ఫోటోషూట్ ని ప్ర‌ఖ్యాత‌ రెడ్ మ్యాగజైన్ అధికారిక ట్విట్టర్ లో రివీల్ చేసింది. ``ఇంకా మే లో అడుగుపెట్ట‌లేదు. అయినా వేడిగా ఉంది. మా కవర్ పేజీ గాళ్.. ఇస్మార్ట్ శంకర్ ఫేం న‌భా న‌టేష్ కూడా అంతే``అన్న వ్యాఖ్య‌ను జోడించారు. నిశ్శబ్దంగా సినీ పరిశ్రమలోని అగ్రస్థానాలకు చేరుకున్న నభా త్వరలోనే అంధాధున్ తెలుగు రీమేక్ ‌లో రాధికా ఆప్టే పాత్రను తిరిగి పోషించనున్నారని వెల్ల‌డించారు. అంధాధున్ తెలుగు రీమేక లో నితిన్ క‌థానాయ‌కుడు. త‌మ‌న్నా మ‌రో క‌థానాయిక‌. మేర్లపాకా గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ స‌ర‌స‌న న‌భా కెరీర్ ప్రారంభ‌మైంది. తొలి సినిమాతోనే న‌భా లోని మాసిజం అభిమానుల‌కు క‌నెక్ట‌య్యింది. ద‌మ్ము కొట్ట‌డం గుర్ర‌పు స్వారీ వంటి విద్య‌ల‌తో న‌భా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ త‌ర్వాత తెలుగులో సుధీర్ బాబు స‌ర‌స‌న డెబ్యూ నాయిక‌గా రంగ ప్ర‌వేశం చేసిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత‌ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ బంప‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో న‌భా న‌ట‌న‌కు అభిమానులు ఫిదా అయిపోయి మ‌రో ఇలియానా అంటూ పొ‌గిడేశారు.