Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బీచ్ ఇసుక‌లో ఆ ఆట‌లేల సీతా?

By:  Tupaki Desk   |   7 Feb 2021 2:30 PM IST
ఫోటో స్టోరి: బీచ్ ఇసుక‌లో ఆ ఆట‌లేల సీతా?
X
బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న‌ ఆలియా ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రంలోనూ న‌టిస్తోంది. త‌న‌ అద్భుత ప్ర‌తిభ‌ను న‌మ్మి ఎస్.ఎస్.రాజ‌మౌళి అవ‌కాశం ఇచ్చారు. అల్లూరి(రామ్ చ‌ర‌ణ్) స‌ర‌స‌న సీత‌గా అభిన‌యిస్తోంది. ఇటీవ‌లే ఆర్.ఆర్.ఆర్ లో తన పోర్షన్ లో న‌టించి అటుపై భ‌న్సాలీ మూవీ కోసం ముంబైకి వెళ్లిపోయింది ఆలియా.

షూట్ గ్యాప్ లో ఇంత‌కుముందే ప్రియుడు ర‌ణ‌బీర్ తో క‌లిసి ప‌లుమార్లు వెకేష‌న్ల‌కు వెళ్లింది. విహార యాత్ర‌ల నుంచి ప్ర‌తి ఫోటోని ఆలియా అభిమానుల‌కు షేర్ చేసింది. గ‌తంతో పోలిస్తే ఈసారి ఇంకా స్పెష‌ల్. అలియా భట్ అభిమానులకు ఈ ఆదివారం అదిరిపోయే విజువ‌ల్ ట్రీట్ ని ఇచ్చింది. ఈ సండే సంథింగ్ స్పెష‌ల్ అని ఈ ఫోటో చూశాక చెప్ప‌క‌నే చెబుతారు.

అలియా బీచ్ ఇసుక‌లో ఎలా ఆట‌లు ఆడుతోందో చూశారు క‌దా? బ‌్లూసీ.. వైట్ సాండ్ లో క‌ల‌ర్ లెస్ వాట‌ర్ లో వ్వావ్ అంటూ చిలౌట్ చేస్తోంది. భట్ ఈ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ప్రస్తుతం ఆలియా విహారయాత్రలో ఉన్న విష‌యం ఇన్ ‌స్టా వేదిక‌గా ఓపెనైంది. వ్యాలెంటైన్ డే ట్రిప్ నా ఇది? ఇంత‌కీ జంట‌గా వెళ్లిందా.. లేక ఒంట‌రిగానా? అన్న సందేహం క‌లిగిన అభిమాని అదే ప్ర‌శ్న‌ను త‌నపై సంధించాడు. దానికి ఆలియా స‌మాధానం ఏమిటో తెలుసా?

వీకెండ్ లో ఒంట‌రిగా మీరు వెకేష‌న్ కి వెళ్లాలనుకుంటున్నారా? అని ఒక అభిమాని అడిగినప్పుడు ఆలియా ఏమంది అంటే.. ``నిజమే కానీ సోలోగా కాదు`` అంటూ స్పందించింది. అంటే ఈ ట్రిప్ లో త‌న‌తో పాటే ర‌ణ‌బీర్ కూడా ఉన్నాడ‌న్న‌మాట‌!!