Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వండ‌ర్ ఉమెన్ తో RRR సీత‌

By:  Tupaki Desk   |   9 July 2022 3:58 AM GMT
ఫోటో స్టోరి: వండ‌ర్ ఉమెన్ తో RRR సీత‌
X
కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7లో ర‌ణ‌వీర్ సింగ్ - క‌ర‌ణ్ ల‌తో క‌లిసి సంద‌డి చేసింది ఆలియాభ‌ట్. ఎపిసోడ్ ఆద్యంతం ఆలియా మెరుపులు ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం దీని గురించి అభిమానుల్లో ముచ్చట కొన‌సాగుతోంది. ఇంత‌లోనే ఆలియా భ‌ట్ త‌న ఫేవ‌రెట్ వండ‌ర్ ఉమెన్ గాల్ గాడోట్ తో క‌లిసి ఉన్న ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటో ఎక్కడి నుంచి వ‌చ్చింది? అంటూ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు.

ఆలియా సంచ‌ల‌నాల ఆర్.ఆర్.ఆర్ లో సీత‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో భ‌న్సాలీ తెర‌కెక్కించిన గంగూభాయి క‌తియావాడీతో బ్లాక్ బస్ట‌ర్ విజ‌యం అందుకుంది. ప్ర‌స్తుతం ఓ హాలీవుడ్ మూవీలో న‌టిస్తూ బిజీగా ఉంది. శుక్రవారం తన తొలి హాలీవుడ్ చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్' చిత్రీకరణను పూర్తి చేసినట్లు ఆలియా స్వ‌యంగా తెలిపారు. స్పై థ్రిల్లర్ లో వండర్ ఉమన్ స్టార్ గాల్ గాడోట్ .. బెల్ ఫాస్ట్ నటుడు జామీ డోర్నన్ కూడా న‌టిస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ చిత్రానికి గ్రెగ్ రుకా- అల్లిసన్ ష్రోడర్ స్క్రిప్ట్ అందించ‌గా.. టామ్ హార్పర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెట్స్ నుండి వరుస ఫోటోల‌తో పాటు ఇన్ స్టాగ్రామ్ లో భట్ తన అభిమాన తార గాల్ గాడోట్ తో ఉన్న ఫోటోని షేర్ చేసింది. మరిచిపోలేని అనుభూతిని అందించిన తన సహనటులకు దర్శకులకు కృతజ్ఞతలు తెలిపింది. ''హార్ట్ ఆఫ్ స్టోన్ నాకు హోలీలా ఉంది.. అందమైన గాల్ గాడోట్ కి ధన్యవాదాలు. మీరందరూ సినిమా చూసే వరకు నేను వేచి ఉండలేను!'' అని ఆలియా పేర్కొంది.

ఈ సినిమా షూటింగ్ కోసం లండన్ లో ఉన్న సమయంలో గత నెలలో తాను గర్భం దాల్చినట్లు ప్రకటించిన భట్ తన భర్త రణబీర్ కపూర్ కోసం ముంబైకి వచ్చేందుకు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. ''ప్రస్తుతానికి.. నేను ఇంటికి వస్తున్నాను బేబీ'' అని గుండె ఎమోజిని షేర్ చేసింది.

గాడోట్ ఈ పోస్ట్ పై వ్యాఖ్యానిస్తూ -''మేము ఇప్పటికే మిమ్మల్ని మిస్ అవుతున్నాము'' అని రాశారు.''ఈరోజు హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసిన అమ్మాయి ఆలియా భ‌ట్ కి నా ప్రేమ..అభినంద‌న‌లు. అద్భుతమైన ప్రతిభావ‌ని.. గొప్ప వ్యక్తి'' అని భట్ తో కలిసి ఉన్న చిత్రంతో పాటు గాడోట్ ప్ర‌శంసాపూర్వ‌కంగా రాశారు.

హార్ట్ ఆఫ్ స్టోన్ అనేది రాచెల్ స్టోన్ (గాడోట్) అనే గూఢచార కార్యకర్త చుట్టూ తిరిగే క‌థాంశం. ఆమె శక్తివంతమైన ప్రపంచ శాంతి పరిరక్ష‌కురాలిగా క‌నిపిస్తుంది. ఆలియా భట్ మేలో ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంది. త‌న పాత్ర యాక్ష‌న్ తో కూడుకుని ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ప్రస్తుతం ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచారు. హార్ట్ ఆఫ్ స్టోన్ ను స్కైడాన్స్ ఫేం డేవిడ్ ఎల్లిసన్= డానా గోల్డ్ బెర్గ్- డాన్ గ్రాంజర్- బోనీ కర్టిస్ - జూలీ లిన్ ల‌తో క‌లిసి గాల్ గాడోట్ ..జారోన్ వర్సనో ల‌ పైలట్ వేవ్ బ్యానర్ నిర్మించింది.హార్పర్- రుకా- పాటీ విట్చర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.